తెలంగాణ

సుపరిపాలనే మోదీ ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, అక్టోబర్ 14: దేశంలో మోదీ పాలన కంటే ముందు అవినీతి, దోపిడీ, మోసాలతో పరిపాలన కొనసాగించారని, దేశంలో సుపరిపాలన, అభివృద్ధి సాధనే ఆశయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుకు సాగారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లొజు అచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన యువభేరి బహిరంగ సభకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురశీధర్‌రావు పాల్గొన్న ఈ సభకు ముందు కడ్తాల్ మండల కేంద్రం నుండి కల్వకుర్తి పట్టణం వరకు బీజేపీ, బీజేవైఎం నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేవైఎం యువభేరి బహిరంగ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ 25 సంవత్సరాలలో రాజకీయాలలో ఉండి పదవులు లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం, అనేక ఉద్యమాలు చేస్తున్న ఏకైక నాయకుడు తల్లొజు అచారి అని కేంద్ర మంత్రి సదానందగౌడ అభినందించారు. దేశంలోనే 20 రాష్ట్రాలలో బీజేపీ పాలన కొనసాగుతుందని, అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లా వర్షాభావ పరిస్థితులలో అచారి జిల్లా నాయకులతో కలిసి తన దగ్గరకు వచ్చి టీఎంసి నీటిని తమ జిల్లాకు ఇవ్వాలని కోరడం నాకు చాలా ఆనందం కలిగిందని మంత్రి పేర్కొన్నారు. పదవులు లేకుంటేనే ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడిని గత ఎన్నికలలో అతి తక్కువ ఓట్లతో కొల్పొయిందని కేంద్ర మంత్రి అన్నారు. దేశంలో మోదీకి రానున్న ఎన్నికలలో మరో అవకాశం ఇస్తే ప్రపంచంలోనే దేశం నంబర్ వన్ స్థానంలో ఉంటుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ పాలన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని కేంద్ర మంత్రి తెలిపారు. రామగుండం ప్యాక్టరీని పునరుద్దరణతో పాటు 150 పంటలకు మద్దతు ధర కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా విద్య, వైద్య సంస్థలు నెలకొల్పడంతో పాటు 17 వేల కోట్ల నిధులను అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉద్యోగ కల్పనతోనే దేశ, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలో ఎక్కడ జాప్యం జరగవద్దని ప్రజా శ్రేయస్సేతోనే ముందుకు సాగాలనే గొప్ప పట్టుదల గల ప్రధాని నరేంద్రమోదీ అని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు. రానున్న సాధారణ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుందని ఇంటలిజెన్స్ సమాచారంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే రాష్ట్రంలో బీజేపీ అధికార దిశగా అడుగులు పడుతున్నాయని పరోక్షంగా కేసీఆర్ ఒప్పుకున్నారని మంత్రి అన్నారు. కల్వకుర్తి పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో తీసిన ర్యాలీతోనే కల్వకుర్తి కాషాయం జెండా ఎగరడం ఖాయమనిపిస్తుందని, విజయోత్సవ ర్యాలీకి నన్ను ఖచ్చితంగా అహ్వానించాలని కేంద్రం మంత్రి బీజేవైఎం నాయకులను కోరారు. దేశాభివృద్ధికి మోదీ అనేక సంక్షేమ పథకాలతో పాటు పేద, బడుగు బలహిన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే కల్వకుర్తి పట్టణానికి మొదటి సారిగా వచ్చిన సదానందగౌడకు బీజేవైఎం ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు.బీజేవైఎం యువభేరి బహిరంగ సభలో కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ ఎన్నికల జాయింట్ కో-అర్డినేటర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.