తెలంగాణ

యువకుల బలిదానాలతోనే సోనియా తెలంగాణ ఇచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 16: యువకుల బలిదానాల కారణంగా చలించిపోయిన సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కామారెడ్డి, పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ షేక్‌వౌ ఆధ్వర్యంలో చేరిన 600 మంది యువకులను కండువాలకు షబ్బీర్‌అలీ కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందంటే ఇందులో యువకుల బలిదానాలు, వారి కృషి ఉందని అన్నారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. యువకులు సైనికుల్లా తెలంగాణ ఉద్యమంలో ముందుకు దూకి తెలంగాణ సాధించుకున్నారని, కానీ ఆ యువకులే ఈరోజు నిరుద్యోగులుగా తిరుగుతుంటే బాధగా ఉందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబీలోకి నెట్టారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 2కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభ్తుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం వృధాగా ఖర్చు చేశారని ఆరోపించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు దుబాయ్ నుండి 25 వేల మంది యువకులకు పాస్‌పోర్టులు లేకునన్నా ప్రభుత్వాలతో చర్చించి వారిని సురక్షితంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకుని వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం కాంట్రాక్టర్‌ల కడుపును నింపేందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ మాదిరిగా తాను ఏనాడు నాసిరకండ్రైనేజీలు, రోడ్లు వేయించలేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సమయంలో చేసిన పనులు నేటికి ప్రజలు గుర్తు చేసుకునేలా ఉన్నాయని అన్నారు. స్కీల్ డెవలప్‌మెంట్ న్యాక్ సెంటర్ మరియు యువకులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎంతోమందిని వారికాళ్లపై వారు నిలబడేలా చేశానని అన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఎంతో మంది మగ్గిపోతున్నారని, అయిన పట్టించుకునే దిక్కులేకుండా పోయిందన్నారు. వీరి గురించి ఏనాడైన కేసీఆర్ కుమారుడైన కేటీఆర్‌కు ఇలాంటివి అక్కర్లేదని ఎద్దేవా చేశారు. జాబ్‌మేళాలలు పెట్టించి రిలయన్స్, టాటా కంపనీల్లో ఈ ప్రాంతంలోని చాలామంది నిరుద్యోగులకు తాను ఉద్యోగాలు ఇప్పించానని అన్నారు. ఈసారి తనను గెలిపిస్తే ఎవ్వరు కూడ ఊహించని రీతిలో కామారెడ్డి సెగ్మెంట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కైలాస్ శ్రీనివాస్‌రావు, వేణుగోపాల్‌గౌడ్ పాల్గొన్నారు.