తెలంగాణ

కర్షకులపై ఖాకీ జులుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 16: నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కుప్పలు పోసి కొనుగోలు కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు మంగళవారం సాయంత్రం తమ ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో రాస్తారోకోకు దిగారు. దీంతో రైతులపై నల్లగొండ పోలీసులు దౌర్జన్యకరంగా ప్రవర్తించిన ఘటన పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. నల్లగొండ మార్కెట్ యార్డులో వారం రోజులకుపైగా తాము ధాన్యం పోయగా తేమశాతం సాకుతో ధాన్యం కొనుగోలు చేయకపోతుండటంతో పగలు రాత్రి ధాన్యం కుప్పల వద్ధనే పడిగాపులు కాయాల్సివస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు ముందున్న నల్లగొండ-హైద్రాబాద్ రోడ్డు మార్గంలో రైతులు రాస్తారోకోకు దిగారు. తమ ధాన్యం కొనుగోలు జరిపించాలని ఇప్పటికే రెండు రోజులు మార్కెట్‌కు సెలవు ప్రకటించారని దసరాకు మరోసారి సెలవు ఇవ్వనున్నారని దీంతో పండుగ పూట సైతం తాము ధాన్యం కుప్పల వద్ధనే ఉండాల్సిన పరిస్థితి ఉందని తమ ధాన్యం కొనుగోలు చేస్తే ఇళ్లకు పోతామని వారు డిమాండ్ చేశారు. అనంతారం, ముశంపల్లి, దైదవారిగూడెం, గుట్టకింది అన్నారం, పిట్టంపల్లి, ఎమ్మిరెడ్డిగూడెం గ్రామాల రైతులు ఆందోళనలో ఉన్నారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు కొద్దిసేపు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసి పదిహేను నిమిషాలు గడిచాక లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టి ట్రాఫిక్ పునరుద్ధరించారు. అనంతరం కొంతమంది రైతులు మార్కెట్ యార్డు గేటు వద్ధకు వెళ్లారు. మరికొందరు రైతులు రైతుబంధు పథకం దరఖాస్తులిచ్చేందుకు వ్యవసాయ కార్యాలయానికి వచ్చారు. అక్కడున్న రైతుల వద్దకు స్థానిక సీఐ బాషా తన సిబ్బందితో వచ్చి పరుష పదజాలంతో రైతులపైకి విరుచుకపడి పలువురు రైతులపై చేయిచేసుకుని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఒక రైతు చొక్కా గల్లా పట్టుకుని మరీ వాహనంలోకి ఎక్కించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు రాస్తారోకో నుండి రైతులను చెదరగొట్టి ఊరుకోకుండా మార్కెట్ యార్డువద్ద ఉన్న రైతుల వద్ధకు వెళ్లి దౌర్జన్యం చేయడం సరికాదంటూ విమర్శలు చెలరేగాయి. ఈ విషయమై సిఐ బాషా మాట్లాడుతు ఎన్నికల కోడ్ అమలులో ఉందని, అంబులెన్స్‌లకు రాస్తారోకోతో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి రైతులను రాస్తారోకో విరమించాలని కోరిన వినిపించకోకపోవడంతో వారిని చెదరగొట్టామని ఎవరి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించలేదంటు వివరణ ఇచ్చారు.
అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఖమ్మం మార్కెట్ ఘటన తరహాలో మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులపై అమానుషంగా ప్రవర్తించిందంటు విమర్శలందుకోవడంతో ఈ వ్యవహారం ఎన్నికల వేళ వివాదస్పదంగా మారింది.