తెలంగాణ

టీఆర్‌ఎస్ మునగడం ఖాయం: రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ సమాజానికి టీఆర్‌ఎస్ పాలన అసలు రంగు అర్ధమైందని టీఆర్‌ఎస్ మునగడం ఖాయమైందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. కాపీల మాస్టర్ అయిన కేసీఆర్ 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన మేనిఫేస్టోకు కాపీ కొట్టారని అన్నారు. 2018లో మహాకూటమి కామన్ మినిమం ప్రోగ్రాంలో చెప్పిన రుణమాఫీ, పెన్షన్ పెంపు, రైతులకు ఆర్థిక భరోసా కార్యక్రమాలనే తిరిగి టీఆర్‌ఎస్ పేర్కొందని అన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే శనిలా తయారైందని, ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల ఊబిలోకి తీసుకుపోయిందని అన్నారు. 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తా అని చెప్పిన కేసీఆర్ నాలుగు సభలకే పరిమితం అయ్యారని, టీఆర్‌ఎస్‌లో ప్రజాస్వామ్యమే కరువయ్యిందని, కేసీఆర్‌ను తొలగించి టీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలని అన్నారు. రోజురోజుకూ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోందని, ఎన్నికలు ఎపుడు జరిగేది తనకు తెలుసని చెప్పిన కేసీఆర్ కలలన్నీ తారుమారు అయ్యాయని, నిర్లక్ష్య పాలన వల్ల ఏం అనర్థాలు జరుగుతాయో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు చవిచూశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి ఆరు లక్షల కోట్లు ఖర్చు చేశారని, ప్రత్యేక ఆర్థిక వనరులు పేరు చెప్పి మరో రెండు లక్షల కోట్లు అప్పు చేశారని, మొత్తం 8 లక్షల కోట్లు ఎవరి జోబులోకి వెళ్లాయో చెప్పాలని నిలదీశారు. కొంగరకొలాన్ సభ విఫలం కావడంతో ఓర్వలేని కేసీఆర్ చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తుఫాను వస్తే నాలుగు రోజులుగా అక్కడే ఉండి ప్రజలకు చంద్రబాబు సేవ చేస్తున్నారని, కొండగట్టు వద్ద ప్రమాదం జరిగితే కనీసం అక్కడికి వెళ్లే ఇంగితం కూడా లేని వ్యక్తి విమర్శలు చేయడం ఏమిటని అన్నారు. కాగా పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నిరుద్యోగులకు 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే దానికి 16 రూపాయిలు కలిపి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిందని, ఇదేమైనా వేలం పాటా అని ప్రశ్నించారు. కేసీఆర్ నిరుద్యోగులను అపహాస్యం చేస్తున్నారని, పెన్షన్ 2వేలు అని చెబితే కేసీఆర్ దానికి 16 రూపాయిలు కలిపి 2016 రూపాయిలు అని చెప్పారని ఎద్దేవా చేశారు.
టీడీపీ ప్రధానకార్యదర్శి బండ్రు శోభారాణి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 32 పేజీలతో 33 వాగ్దానాలు చేసిందని, ఇందులో ఎన్ని పూర్తి చేసిందో ప్రజలకు చెప్పాలని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడు ఎకరాల భూ పంపిణీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కేజీటు పీజీ ఉచిత విద్య అమలు ఎంత వరకూ చేశారో చెప్పాలని నిలదీశారు.
22న టీడీపీ మేనిఫెస్టో
టీడీపీ మేనిఫెస్టోను ఈ నెల 22న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ముసాయిదాకు మేనిఫెస్టో కమిటీ తుది మెరుగులు దిద్దుతోంది.దందని అన్నారు.