తెలంగాణ

మేనిఫెస్టోపై గులాబి శ్రేణుల్లో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ హామీలను ప్రజలు విశ్వసించడం లేదు: ఎంపీ వినోద్ * కూటమికి డిపాజిట్లు కూడా దక్కవు: ఎంపీ బాల్క

హైదరాబాద్, అక్టోబర్ 17: అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ప్రత్యర్థి రాజకీయ పార్టీల కంటే ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, మేనిఫెస్టో విడుదల పార్టీ నేతలు, శ్రేణుల్లో మరింత జోష్ పెంచింది. మేనిఫెస్టోలో ప్రకటించిన జనరంజక వరాల వల్ల తిరిగి అధికారంలోకి రావడం పక్కా అని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేనిఫెస్టోలో ప్రకటించిన వరాలు అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా పార్టీకి భారీ మెజార్టీని సాధించడానికి ఓటు బ్యాంక్ ఖాయమైనట్టేనని అభ్యర్థుల్లో గెలుపు ధీమాను మరింత పెంచింది. రైతుబంధు పథకం ఇప్పటికే అమలులో ఉండటంతో పంట రుణాల మాఫీ ఈ సారి మేనిఫెస్టోలో ఉండకపోవచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు భావించాయి. అయితే తిరిగి ఈ సారి కూడా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల పంట రుణ మాఫీని ప్రకటించడం వల్ల రైతుల్లో హర్షామోదం వ్యక్తం అవుతున్నట్టు అభ్యర్థుల నుంచి ఫీడ్ బ్యాక్ అందుతోందని టీఆర్‌ఎస్ అధిష్ఠాన వర్గం సమాచారం. రైతుబంథు, పంట రుణాల మాఫీ వల్ల సుమారు 50 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని టీఆర్‌ఎస్ నేతలు లెక్క కడుతున్నారు. అలాగే ఆసరా పెన్షన్ల వయో పరిమితిని 57 సంవత్సరాలకు కుదించడం, పెన్షన్ల మొత్తాన్ని పెంచడం వల్ల లబ్ధిదారుల సంఖ్య దాదాపు 40 లక్షలకు చేరతుందన భావిస్తున్నారు. రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ రోగులు ఆసరా పెన్షన్ వల్ల ప్రయోజనం పొందుతున్నారు. ఈ సారి ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా నిరుద్యోగ భృతిని కూడా టీఆర్‌ఎస్ ప్రకటించింది. దీని వల్ల 11 నుంచి 12 లక్షల మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలుగనుందని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతి వల్ల అరకోటి మందికి ప్రయోజనం చేకూరడంతో పాటు ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రుణ మాఫీని ప్రకటించడం వల్ల ఒక్కో కుటుంబంలో తక్కువలో తక్కువ నలుగురు ఉన్నా వీరి సంఖ్యనే రెండు కోట్ల ఉంటుందని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాక్షిక మేనిఫెస్టోలో ప్రకటించిన వరాల వల్ల రెండున్నర కోట్ల మంది జనాభాకు ప్రయోజనం కలుగుతుందని, ఇవ్వే కాకుండా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి జనాకర్షక పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండు, మూడు పథకాల వల్ల లబ్ధి చేకూరనుందని, కనీసం వీరిలో సగం మంది టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసినా ప్రభంజనం సృష్టిస్తుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. తమ మెనిఫెస్టో ప్రకటన తర్వాత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కడం కూడా అనుమానమేనని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గుప్పిస్తోన్న హామీలను ప్రజలు విశ్వసించడం లేదని, ప్రజలు తమ పార్టీకే పట్టం కట్టబోతున్నారని మరో ఎంపె బి వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేసారు.