తెలంగాణ

పట్నం నుంచి పల్లెకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 17: దసరా పండుగకు ప్రజలు పట్నం విడిచి పల్లెకు పయనమయ్యారు. ప్రభుత్వం దసరా పండుగకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సెలవులు ఇవ్వడంతో పల్లెకు వెళ్లి పండుగ చేసుకునేందుకు తమ వాహనాలలో బయలుదేరారు. దీంతో దసరా ముందు రోజు హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారికి వాహనాల తాకిడి పెరిగింది. రోజువారి కంటే వాహనాలు రెట్టింపు అయ్యాయి. జాతీయ రహదారిపై అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం శివారులో శ్రీ ఆంధోల్‌మైసమ్మ దేవాలయం వద్ద వాహనదారులు తమ వాహనాలకు పూజలు చేసేందుకు బారులుకట్టడంతో హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆలయ పరిసరాలు లారీలు, ఇతర వాహనాలతో కిటకిటలాడాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరాయి. వాహనాలు ఎప్పటికప్పుడు వెళ్లేందుకు జీఎంఆర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అదనపు టోల్‌గేట్లు ఏర్పాటు చేసారు. చౌటుప్పల్ పట్టణంలో వాహనాల రద్ధీతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.