తెలంగాణ

హరీష్, రేవంత్‌కు ఈసీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదులపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నలుగురు నేతలకు ఎన్నికల కమిషన్ శుక్రవారం తాఖీదులు జారీ చేసింది. వీరిలో మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ నాయకులు రేవంత్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీడీపీ నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. 48 గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నలుగురు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. తన కార్యాలయంలో రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి హరీశ్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు టీటీడీపీ నాయకులు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. అలాగే మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్‌ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని వారిద్దరికీ నోటీసులు జారీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నాయకుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ‘కోడ్’కు విరుద్ధంగా ఉన్నాయని టీఆర్‌ఎస్ చేసిన మరో ఫిర్యాదుపై కూడా ఆయనకూ నోటీసులు ఇచ్చినట్టు రజత్‌కుమార్ తెలిపారు. వీరు ఇచ్చిన వివరణపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు.