తెలంగాణ

బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ముందస్తు ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్‌పీ మాజీ నేత కే. జానారెడ్డి భరోసా ఇచ్చారు. అధిష్ఠానం అంగీకరిస్తే తన కుమారుడే పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. జానారెడ్డి శుక్రవారం తన నివాసంలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రజా కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో పొత్తుల అంశంపై స్పష్టత వస్తుందనుకున్నామని అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా దుబాయి వెళ్లినందున శనివారం స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టిక్కెట్ ఇవ్వమని, ఎప్పుడు ఎక్కడా చెప్పలేదని జానా పేర్కొన్నారు. పొత్తు కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు ఈసారి సీట్లు తగ్గిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గతంలోలాగే బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని జానారెడ్డి చెప్పారు. ‘సీట్ల సర్దుబాట్ల సందర్భంగా ఒకటి, రెండు పెరగవచ్చు. తగ్గవచ్చు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సహజం’అని కాంగ్రెస్ సీనియర్‌నేత వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ప్రజలు ఓడించి రికార్డు సృష్టిస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప వ్యక్తి ఏమీ కాదని ఆయన అన్నారు. కేసీఆర్ అప్పులు చేసి అభివృద్ధి అంటున్నారని ఆయన విమర్శించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జాప్యం జరిగినా, గెలుపుతమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హైకమాండ్‌దే నిర్ణయం...
తననుగానీ, తన కుమారుణ్నిగానీ పోటీ చేయాల్సిందిగా కార్యకర్తలు కోరుతున్నారని జానారెడ్డి తెలిపారు. అధిష్ఠానం ఒకే అంటే తన కుమారుడే పోటీ చేస్తాడని స్పష్టం చేశారు. సీఎం ఎవరు అవుతారనేది చర్చ కాదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. గత ఎన్నికల్లోలాగే మాటలతో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారని, ఈసారి అలా జరగదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. టిక్కెట్లు రాని వారికి అసంతృప్తి ఉండడం సహజమేనని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.