తెలంగాణ

సీపీఐ, కోదండరాం పునరాలోచించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 13: అవినీతి పాలనతో ప్రజలను ఇబ్బందులపాలు చేసిన కాంగ్రెస్‌తో జట్టు కట్టడమే కాకుండా, సీట్ల కేటాయింపు విషయంలో జరిగిన అవమానంపై సీపీఐ, కోదండరాం పునరాలోచించి బీఎల్‌ఎఫ్‌తో కలిసి రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆహ్వానించారు. ఖమ్మంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం ఒకే రకమైన విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటే నేడు టీఆర్‌ఎస్ కూడా వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిలబెట్టడంతో పాటు బహుజనుల రాజ్యమే లక్ష్యంగా బిఎల్‌ఎఫ్ స్థాపించామని, కేవలం ఒకే అంశంపై మినహా మిగిలిన వాటిపై అంతా ఏకాభిప్రాయమే ఉందన్నారు. సీపీఐ, కోదండరాం కేవలం టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యమని పేర్కొన్నారని, తాముమాత్రం ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నామన్నారు. సీపీఐ, కోదండరాం కలిసివస్తే ఎక్కువ సీట్లలో పోటీ చేయడమే కాకుండా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా దేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాల్లో సీపీఎం భాగస్వామ్యం కాబోదన్నారు. కాంగ్రెస్‌తో దేశంలో ఒక్కడా పొత్తు ఉండే ప్రసక్తే లేదని, చంద్రబాబు చేస్తున్న ప్రయత్నానికి తమ మద్దతు ఉండబోదని స్పష్టం చేశారు. కేవలం సొంత అవసరాల రీత్యా చంద్రబాబు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీఎల్‌ఎఫ్ తరహా కూటములు ఏర్పాటవుతున్నాయని, ఎక్కడా కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండే ప్రశ్న లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్ 30స్థానాల్లో గట్టి పోటీని ఇస్తున్నదని, ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రూ. 50వేల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని, దశాబ్దాలుగా కుంభకోణాల్లో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీని తరిమివేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.