తెలంగాణ

టికెట్ రాలేదని.. కంటతడి పెట్టిన పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి....
============
సూర్యాపేట, నవంబర్ 13: సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి కంట తడిపెట్టారు. ఢిల్లీ నుంచి మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన తన అనుచరులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు రమేష్‌రెడ్డి స్థానికుడని, దామోదర్‌రెడ్డి స్థానికేతరుడని నినాదాలు చేశారు. ప్రదర్శన అనంతరం కృష్ణానగర్ కాలనీలోని తన నివాసానికి చేరుకున్న రమేష్‌రెడ్డి అక్కడికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను చూసి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఆయన సతీమణి లావణ్యారెడ్డి, ఆయన సోదరుడు, ప్రవాసాంధ్రుడు పటేల్ శ్రీ్ధర్‌రెడ్డిలు దగ్గరకు రాగానే ఒక్కసారిగా వారిని హత్తుకుని కంట తడి పెట్టారు. ఈ దృశ్యాన్ని చూసిన అభిమానులు సైతం ఉద్వేగానికి లోనై ఆయనను ఆలింగనం చేసుకుని బాధను పంచుకున్నారు. మరోవైపు ఆయన నివాసం ముందు శరత్ అనే అభిమాని వంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడ ఉన్న వారు అడ్డుకుని వారించారు.