తెలంగాణ

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి....
============
సిద్దిపేట/నంగునూర్, నవంబర్ 13: ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సీఎం కేసీఆర్ వద్దకు ప్రజలు సమన్వయంతో స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వరాలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఈనెల 14న కేసీఆర్ కోనాయిపల్లి వస్తండటంతో హెలిప్యాడ్‌తో పాటు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బస్సులో వచ్చే అవకాశం ఉందని, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు. ఆలయంలో పూజలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు, ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఆలయం ఆవరణలో గ్రామం పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇతర గ్రామాల నుండి ప్రజలు రావద్దని, గ్రామస్తులు, మహిళలు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బందారం దర్గా నుండి వెల్కటూర్ మీదుగా, లేదా రంగధాంపల్లి, ముండ్రాయి మీదుగా కోనాయిపల్లికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గన వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఈ మార్గాలను అధికారులు పరిశీలించి, పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరగా వీలుకాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.