తెలంగాణ

పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్ అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 15: పేద ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్ అజెండాగా పెట్టుకుని పనిచేస్తోందని విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ‘మేము సైతం మీతోనే’ నినాదంతో హమాలీ సంఘం ఆధ్వర్యలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వం కార్మిక సంక్షేమంలోనూ అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవన్నారు. కార్మికుల సంక్షేమంలోనే సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్మికులకు భద్రత కల్పించడంతోపాటు వారి కుటుంబానికి భరోసానిస్తూ ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందన్నారు. సూర్యాపేటలో తనకు గత ఎన్నికల్లో అధికంగా మద్దతు ఇచ్చింది హమాలీలు, కార్మికులేనని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. జిల్లా కేంద్రానికి మరో పది రోజుల్లో స్వచ్ఛమైన కృష్ణా నీటిని ఇంటింటికీ అందించి మూసీ మురికి నీటి నుంచి విముక్తి కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేయబోతున్న వైద్య కళాశాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధిని కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.