తెలంగాణ

స్వతంత్రంగా బరిలోకి శశిధర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
===========
సంగారెడ్డి, నవంబర్ 16: వ్యవసాయ క్షేత్రంగా తులతూగుతూ మెతుకుసీమగా ఖ్యాతిగాంచిన మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రసవత్తర రాజకీయాలకు ఏ మాత్రం కొదువలేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లో అభ్యర్థులు వ్యవహరించిన తీరును పరిశీలిస్తే ఉత్కంఠ భరిత పరిస్థితులే దర్శనమిస్తాయి. 2004లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. అధికార టీడీపీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలన్ని మహాకూటమిగా జతకట్టాయి. పొత్తులో భాగంగా మెదక్ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్ పార్టీ దక్కించుకుంది. అధికార టీడీపీ పార్టీపై నెలకొన్న ప్రజావ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగాలని శశిధర్‌రెడ్డి ఆశిస్తే పొత్తుల వ్యవహారంతో బెడిసి కొట్టింది. టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా వై.ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దింపగా టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి పోటీ చేసారు. ఇద్దరిని తోసిరాజని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శశిధర్‌రెడ్డి చివరి క్షణంలో జనతా పార్టీ బీ ఫాం సమర్పించి ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఉమాదేవిపై జనతా పార్టీ అభ్యర్థి శశిధర్‌రెడ్డి గెలుపొందగా కూటమి అభ్యర్థి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. అనంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆహ్వానం మేరకు మెదక్ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో రామాయంపేట నియోజకవర్గం కనుమరుగై నియోజకవర్గ కేంద్రం మెదక్‌లో అంతర్భాగమైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీలు మళ్లీ జతకట్టాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి బరిలోకి దిగగా కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంతరావు పోటీ చేసారు. కూటమికి వ్యతిరేకంగా అప్పటి వరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పద్మా దేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో కూటమిదే పైచేయిగా నిలిచి టీడీపీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్‌రెడ్డిపై సునాయాసంగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు శశిధర్‌రెడ్డి ప్రయత్నించగా అప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మెదక్ ఎంపీ విజయశాంతి అసెంబ్లీ నుంచి పోటీకి దిగారు. దీంతో విజయశాంతి గెలుపు పట్ల శశిధర్‌రెడ్డి వర్గం సక్రమంగా పని చేయలేదన్న ఆరోపణలు నేటికి నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్‌ల పొత్తుతో 2004 ఎన్నికలను తలపించే విధంగా రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ టికెట్ కోసం ఆశిస్తున్న శశిధర్‌రెడ్డిని కాదని ఈ స్థానాన్ని టీజెఎస్‌కు కేటాయించడంతో శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఇప్పటికే నామినేషన్ పత్రాలు సమర్పించారు. చివరి వరకు కాంగ్రెస్ బీ ఫాం దక్కించుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకవేళ బీ ఫాం రానిపక్షంలో 2004 ఎన్నికల మాదిరిగానే శశిధర్‌రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీ నుండి బీ ఫాం సమర్పించి తన సత్తా చాటుకోవాలని వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌పై నెలకొన్న ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకుని మరోమారు తన సత్తా ఏమిటో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చూపించడానికి శశిధర్‌రెడ్డి వర్గం తహతహలాడుతోంది. మొత్తంమీద మెదక్ రాజకీయ వాతావరణం రసకందాయంలో పడటం ఖాయమని చెప్పవచ్చు. నామినేషన్ల ఘట్టం పూర్తయితే కానీ అసలు సిసలైన రాజకీయాలకు తెరలేవనుంది.