తెలంగాణ

విద్యాసంస్థలు పన్ను అతిక్రమిస్తే తీవ్ర చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యాసంస్థలు పన్ను అతిక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని హైదరాబాద్ ప్రాంత ఆదాయ పన్ను కమిషనర్ డాక్టర్ రాజేంద్రకుమార్ పేర్కొన్నారు. మూల ధనం వద్ద పన్ను మినహాయింపు నిబంధనలను అతిక్రమించినట్టయితే ఆదాయ పన్ను చట్టం 1961లోని 271 సీ, 272ఎ (2) సెక్షల ప్రకారం శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పన్నులు సకాలంలో నిర్దేశిత కాలంలో చెల్లించకుంటే చట్టంలోని 276బీ ప్రకారం నేరంగా పరిగణిస్తామని, ఇందుకు ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష విధించే వీలుందని అన్నారు. పన్నులు సంబంధిత అతిక్రమణల కారణంగా దోష నిర్ధారణ పెరుగుతుందని అన్నారు. హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 11 సంస్థల అకౌంట్లను సమీక్షించడం జరిగిందని, ఆ సంస్థల్లో కొన్ని ప్రభుత్వ రంగానికి చెందినవి, ఇంకొన్ని ప్రైవేటు రంగానికి చెందినవి ఉన్నాయని, వాటిలో విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయని, టీడీఎస్‌ను ఉద్యోగుల నుండి మినహాయించినా ఆ మొత్తాన్ని మాత్రం చెల్లింలేదని గుర్తించామని అన్నారు. అంతేగాక, ఆయా విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న లెక్చరర్లకు ఫారం -16ను జారీ చేయకపోవడంతో వారు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయినట్టు వారి నుండి విన్నపాలు వస్తున్నాయని అన్నారు. 50 కోట్ల రూపాయిల మేరకు అతిక్రమణలు జరిగాయని, దాని వల్ల టీడీఎస్‌కు ఐదు కోట్ల మేర గండిపడిందని చెప్పారు. ఆదాయ పన్ను విభాగంలోని టీడీఎస్ డివిజన్ ఈ తరహా చర్యలను తీసుకుంటోందని పేర్కొన్నారు. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లోని లెక్చరర్లకు ఆదాయపన్ను శాఖ భరోసాగా ఉంటుందని చెప్పారు.