తెలంగాణ

తొలి సంతకం ధర్నా చౌక్ పునరుద్ధరణపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తాము అధికారంలోకి రాగానే ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విః హనుమంత రావు హామీ ఇచ్చారు. ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా హైకోర్టు ఇటీవల తాత్కాలికంగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం ధర్నా చౌక్ వద్ద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై వీహెచ్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీహెచ్ అధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, మాజీ ఎమ్మెల్సీ కే. నాగేశ్వర్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ ప్రసంగిస్తూ తమ నిరసన గళం ప్రభుత్వానికి వినిపించేందుకు వీలుగా ధర్నా చౌక్‌ను అందుబాటులోకి తెచ్చినందుకు న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ధర్నా చౌక్‌ను శాశ్వతంగా తెరిపించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాల పాటు సాగిన నియంతృత్వ పాలనకు ఈ ఎన్నికల్లో ప్రజలు చరమ గీతం పాడనున్నారని ఆయన చెప్పారు.