తెలంగాణ

నేటి బీసీల రాష్ట్ర బంద్ వారం రోజులు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ముందస్తు ఎన్నికల్లో బీసీలకు సరైన విధంగా టిక్కెట్లు ఇవ్వనందుకు నిరసనగా 17న నిర్వహించాలనుకున్న రాష్ట్ర బంద్‌ను వారం రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ఓక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ల ఊరేగింపులు జరుగుతున్నందున, ఇంజనీరింగ్, ఫార్మసి విద్యార్థుల పరీక్షలు జరుగుతున్నందున తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, అనంతయ్య, జైపాల్ ముదిరాజ్, నంద గోపాల్, బీఆర్ కృష్ణ, నరసింహ గౌడ్, బర్క కృష్ణ, టి. రాజ్‌కుమార్, సి. రాజేందర్, రమ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.