తెలంగాణ

కాంగ్రెస్, టీడీపీలో దోబూచులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 17: నామినేషన్ల పర్వం పూర్తి కావడానికి గడువు సమీపిస్తున్న కొద్ది పటన్‌చెరు నియోజకవర్గం ఎవరికనేది మహాకూటమిలో ఉత్కంఠకు గురి చేస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో ఢీ లిమిటేషన్‌లో విడిపోయి పటన్‌చెరు నియోజకవర్గంగా అవతరించిన విషయం తెలిసిందే. కొత్తగా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్న ఎన్నికల్లో పటన్‌చెరులో ఆసక్తికర రాజకీయాలకు తెరలేవడం పరిపాటిగా మారింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్‌ఎస్, ఇతర పార్టీలన్ని మహాకూటమిగా జతకట్టాయి. అప్పట్లో టీఆర్‌ఎస్, టీడీపీల మద్య ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి యుద్ద వాతావరణమే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నందీశ్వర్‌గౌడ్ నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ నుండి సఫాన్‌దేవ్ నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీ ఫామ్ కూడా అందజేసాడు. పొత్తులో భాగంగా ఈ స్థానం టీఆర్‌ఎస్‌కు కేటాయించాల్సి ఉందని, అలాంటప్పుడు టీడీపీ ఎలా పోటీ చేస్తుందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బాబును ప్రశ్నించడం, అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో చేసేదేమి లేకుండాపోయింది. టీడీపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపైనే సఫాన్‌దేవ్ బరిలో నిలువడంతో చివరి క్షణంలో సఫాన్‌దేవ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్, టీడీపీ అభ్యర్థి సఫాన్‌దేవ్ మద్యనే కొనసాగగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మహాకూటమిగా కాంగ్రెస్, టీడీపీలు జతకట్టడంతో అభ్యర్థుల మద్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన నాయకులంతా కాంగ్రెస్ పక్షాన చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నందీశ్వర్‌గౌడ్ ముందస్తు ఎన్నికల ప్రకటన తరువాత టీడీపీలోకి మారారు. పొత్తులో భాగంగా సీట్ల పంపకాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఓ కొలిక్కి వచ్చినా పటన్‌చెరుపై ఎటు తేల్చకుండా కూటమి నేతలు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని దక్కించుకుని తిరిగి బరిలోకి దిగాలని నందీశ్వర్‌గౌడ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఆశావహులు టికెట్ తమకే దక్కుతుందనే ధీమాతో నామినేషన్లు దాఖలు చేసుకుని కూర్చున్నారు. రెండు పార్టీల అధిష్టాలను ఎటు తేల్చకుండా సస్పెన్స్‌కు తెరదించకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ శ్రేణులను ఉత్కంఠకు గురి చేస్తోంది. టీడీపీకి దక్కితే నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నేతలు ఎంత వరకు ఉపసంహరించుకుంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌కే ఈ స్థానం దక్కితే నందీశ్వర్‌గౌడ్ పరిస్థితి ఏమిటన్నదానిపై ప్రధాన చర్చ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. నందీశ్వర్‌గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయా అన్న కోణంలో కూడా నియోజకవర్గంలో చర్చకు తెరలేచింది.