తెలంగాణ

మోదీ పాలనకే జనం ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడటౌన్, నవంబర్ 17: గత నాలుగేళ్లుగా గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది అగ్రరాజ్యలకు దీటుగా దేశం ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధి పెట్టించిన ఘనత ప్రధాని మోదీదని.. ప్రజలు మళ్లీ మోదీ పాలనను కోరుకుంటున్నారని ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ చెప్పారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలందరు సుభిక్షంగా ఉండేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని తెలిపారు. గత నాలుగేళ్ల యూపిఏ పాలనలో దేశ ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. అప్పుల్లో కురుకపోయిన దేశాన్ని ఆ ఊబిల్లోంచి బయటకుపడేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పారు.వరంగల్ జిల్లాలో జరిగిన పూజారి హత్య చేసిన వ్యక్తిని ..ఆ సమాజం వాళ్లు వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించాలని సూచించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. భారత దేశం సర్వమతాల సమ్మేళనం అందరూ సుఖజీవనం సాగించేలా మోదీ పాలన ఉన్నదని చెప్పారు.2019 సాదరణ ఎన్నికలకు ముందే కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల నుంచి మోదీకి తగిన ఆదరణ అభిమానాలు లభిస్తున్నాయని చెప్పారు.
శ్రీ రాజరాజేశ్వరస్వామిని ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్‌మోదీ శనివారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలోకి రాగానే బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ,అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.స్వామివారికి కోడెకు ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కు చెల్లించుకున్నారు. అంతరాలయంలోని స్వామివార్లను,అమ్మవారిని దర్శించుకొని సేవించారు.