తెలంగాణ

మాయగాళ్లొస్తున్నారు..జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, నవంబర్ 17: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా మద్దతును కూడగట్టుకునేందుకు కూటమి పేరిట మాయగాళ్లు ఊళ్లలోకి వస్తున్నారని, వారిని ఓటు అనే ఆయుధంతో మాయం చేయాలని రాష్ట్ర అపద్ధర్మ మంత్రి, బాన్సువాడ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రచారం పేరిట కాంగ్రెసోళ్లు కబుర్లతో అమలు కాని హామీలను గుప్పించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్, రాంపూర్, దేశాయిపేట్, సోమేశ్వర్, నాగారం, కొల్లూర్ గ్రామాలలో పాల్గొన్నారు. రైతుల అభ్యున్నతికై ప్రపంచంలో అమలు చేస్తున్న 20వినూత్న పథకాలలో తెలంగాణాలో అమలవుతున్న రైతుబంధు, బీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం హర్షణీయమన్నారు. దీనిని తెలంగాణ రైతులకు దక్కిన అరుదైన గౌరవంగా తాము భావిస్తున్నామని అన్నారు. తెలంగాణాలో అమలవుతున్న పథకాల తీరుతెన్నులు దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులు అప్పుల పాలు కాకుండా వ్యవసాయంలో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు.
రోజుల్లో కూడా ప్రజాభ్యున్నతి అనే విజన్‌తో కేసీఆర్ కార్యదీక్షతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రస్తుత మెనీఫెస్టో కూడా ప్రజల బాగును కోరి తయారుచేయడం జరిగిందన్నారు. పుడమిని నమ్ముకొని జీవించే రైతు ఎలాంటి కష్టాలు పడకుండా సేద్యం సాగించాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారని తెలిపారు. వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 1500 ఫించన్‌ను నెలకు రూ. 3016లను పెంచి ఫించన్ కింద చెల్లించేందుకు మెనీఫెస్టోలో పెట్టడం జరిగిందని చెప్పారు.