తెలంగాణ

ఎన్నికల పరిశీలకులు వచ్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 17: వచ్చే నెల 7న జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు నియమించడం జరిగింది. 68మంది అధికారులను నియమిస్తూ వెంటనే కేటాయించిన నియోజకవర్గాలలో బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సిర్పూర్, ఆసిఫాబాద్‌లకు క్రిష్ణగోహైన్, చెన్నూరు నియోజకవర్గానికి ఆర్.జె హలాని, బెల్లంపల్లి, మంచిర్యాలలకు జీహెచ్.ఖాన్, ఆదిలాబాద్, బోద్ నియోజకవర్గాలకు సురేంద్ర కుమార్‌బగ్డే, ఖానాపూర్, నిర్మల్‌లకు డాక్టర్ ప్రకాశ్ జీజీ, ముదోలు నియోజకవర్గాలకు ఎబీ మిసై, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు కుమార్ సురభ్‌రాజ్, బోధన్, బాన్స్‌వాడలకు దేవర్ష్‌దేవై, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు ధీరాజ్ కుమార్, జుక్కొలు నియోజకవర్గానికి బ్రిజ్‌రాజ్‌రాయ్‌ని నియమించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డిలకు అభిషేక్ క్రిష్ణ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలకు డాక్టర్ రామస్వామి ఎన్, ధర్మపురి నియోజకవర్గానికి తాషి దిన్‌దుప్ షెర్పా, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాలకు డాక్టర్ చంద్రకంట్ లక్ష్మణ్‌రావుపుల్కొందవర్, మంథనికు సంజయ్‌కుమార్ సింగ్, కరీంనగర్, హుజురాబాద్ నియోజకవర్గాలకు అశోక్‌కుమార్ ఆర్ పమేర్, చొప్పదండి, మనకొందుర్ నియోజకవర్గాలకు రాం ప్రతాప్ సింఘ్ జడొన్, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు ప్రవత్ కుమార్ లెంక, నారాయణఖేడ్, జహీరాబాద్‌లకు హర్‌సాహ్యమీనా, ఆందోలు, సంగారెడ్డిలకు ప్రేమదేష్‌బ్రతర్, పటాన్‌చెర్వు నియోజకవర్గానికి బ్రిష్‌చంద్ర బ్రమన్‌ను నియమించారు. అలాగే మెదక్, నర్సాపూర్‌లకు సునితవర్మ, హుస్నాబాద్, సిద్దిపేటలకు డీఎస్.గాదేవి, దుబ్బాక, గజ్వేల్‌లకు గంగాధర్‌పత్ర, ఇబ్రహీంపట్నంకు నాగనాథ్ తబసుంఅబ్రూ, లాల్‌బదూర్ నగర్, మహేశ్వరంలకు రబింద్రనాథ్‌రాయ్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలకు డాక్టర్ డి. జగన్నాథన్, చేవెళ్ల, కల్వకుర్తిలకు వికేదుర్వే, షాద్‌నగర్‌కు మహేంద్రసోని, పరిగి, వికరాబాద్‌లకు శేఖర్‌వర్మ, తాండూరు, కొడంగల్‌లకు బిశ్వరంజన్ సమై, మెడ్చల్, ఉప్పల్‌లకు అలోక్ అవస్తి, ఖుత్భుల్లాపూర్, కుకట్‌పల్లిలకు షంషేర్ సింగ్, మల్కాజిగిరి కుమార్ అరున్ ప్రకాశ్, ముషిరాబాద్, మలక్‌పేట, అంబీర్‌పేట్‌లకు డా.రోషన్ అర్రబెగుమ్, ఖైరతాబాద్, జుబ్లిహిల్స్‌లకు డాక్టర్ అశిష్‌కుమార్‌భుతని, సనత్‌నగర్, నాంపల్లిలకు సంజయ్ కందరే, కర్వాన్, గోష్‌మహల్‌లకు జోషి అజిత్ బాలాజి, చార్మినార్, చంద్రయానగుట్టలకు మంజిత్ సింగ్‌బ్రార్, యకుత్‌పుర, బహదూర్‌పురలకు నిలమోహనన్ నియమితులయ్యారు. సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోనె్మంట్‌లకు భుపెందర్‌పైసింగ్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లకు యశ్వంత్‌రావు, జడ్చర్ల, మక్తల్, దేవరకద్రలకు బిఎస్.శంకరప్ప, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌లకు శ్రీకాంతప్రుస్టే, అచ్చంపేటకు ధనిల్‌కందుల్నా, వనపర్తికి ఆర్.నానితగోపాల్, గద్వాల, అలంపూర్‌లకు విబి పతి, దేవరకొండ, నాగార్జునసాగర్‌లకు విద్యాసాగర్ ప్రసాద్, మిర్యాలగూడ, నల్గొండలకు దిరేంద్రకుమార్ తివాన్, మునుగోడు, నకిరేకల్‌లకు నిరంజన్ కుమార్, హుజుర్‌నగర్, కోదాడలకు టి.బ్రహ్మం, సూర్యపేట, తుంగతుర్తిలకు రాజేంద్రకుమార్‌సింగ్, భువనగిరి, ఆలేరులకు తేజ్‌ప్రతాప్‌సింగ్ పోల్కా, జనగామకు పి.రాజేంద్ర చోలాన్, స్టేషన్ ఘనపుర్‌లకు, పాలకుర్తికు ప్రవీణ్ పీ నాయర్, మహబూబాబాద్, డొర్నకల్‌లకు ఎస్.విసాకన్, నర్సంపేట్, పరకాలకు ధుషికంపార్కె, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్‌లకు సురేంద్రసింగ్, వర్దన్నపేటకు ఆనంద్, భూపాలపల్లికి దీపక్ ఎం.ముగ్లికర్, ములుగుకు అనిమేష్‌దాస్, పినపాక, ఇల్లందుకు కుంజ్‌బిహరీ పాండ్య, భద్రాచలం, కొత్తగూడెంలకు జగ్‌జిత్‌సింగ్, అశ్వరావుపేటకు ఎంపీ.కళ్యాన్‌కర్, ఖమ్మం, పాలేరుకు దివేష్‌సెహ్రా, మధిర, వైరాలకు భగవాన్‌దాస్, సత్తుపల్లికి యుగల్ కిషోర్‌పంత్‌లను నియమించారు.