తెలంగాణ

గీతం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జేఈఈ ర్యాంకర్లకు ఫీజు రాయితీ * ప్రో వీసీ ప్రొఫెసర్ శివప్రసాద్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 17: గీతం యూనివర్శిటీ హైదరాబాద్ ప్రాంగణంలో బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సులకు ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించినట్టు వర్శిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ తెలిపారు. శనివారం నాడు ఆయన పాత్రికేయుల సమావేశంలో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. తొమ్మిది బీటెక్ కోర్సులు, ఏడు ఎంటెక్ కోర్సులు, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు. గీతం టెస్టులో పదిలోపు ర్యాంకర్లకు తొలి ఏడాది రుసుం లో పూర్తి రాయితీ ఇస్తామని, 100 లోపు ర్యాంకులు వస్తే 75 శాతం, 500లోపు ర్యాంకర్లకు 50 శాతం ఫీజు రాయితీ ఇస్తామని చెప్పరు. జెఈఈ ర్యాంకర్లకు ఫీజు రాయితీ ఇస్తామని, అలాగే ఎమ్సెట్ ర్యాంకర్లకు కూడా ఫీజు రాయితీ ఉంటుందని అన్నారు. ప్రతి ఏటా 8.5 సీజీపీఏ సాధించిన విద్యార్ధులకు ఈ రాయితీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్ పరీక్షను నగోలు, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్‌తో పాటు దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో నిర్వహిస్తామని చెప్పారు. పూర్తిచేసిన దరఖాస్తులను మార్చి 30లోగా సమర్పించాలని, ఆన్‌లైన్ పరీక్షలు ఏప్రిల్ 10 నుండి 22 వరకూ జరుగుతాయని తుది ఫలితాలను ఏప్రిల్ 26న ప్రకటిస్తామని అన్నారు. ఇతర వివరాలకు వర్శిటీ ప్రాంగణాన్ని సందర్శించాలని చెప్పారు. ప్రొఫెసర్ సీహెచ్ సంజయ్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ డాక్టర్ జీ శివకుమార్, ప్రొఫెసర్ సునీల్ కుమార్, ప్రొఫెసర్ వై లక్ష్మణ్ కుమార్, డాక్టర్ జీఏ రామారావు, డెవీఎస్‌ఆర్ వర్మ, డాక్టర్ నాతి వేణుకుమార్, ఆర్ రవికుమార్, డాక్టర్ కే శివకుమార్ పాల్గొన్నారు.