తెలంగాణ

సోషల్ మీడియా ప్రకటనలనూ లెక్కిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ఎన్నికల ప్రచారానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను కూడా అభ్యర్థుల ఖర్చులో చేరుస్తామని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోషియల్ మీడియాలో వచ్చే ప్రకటనల వివరాలను అభ్యర్థులు ఫాం-26 ద్వారా ఎన్నికల కమిషన్‌కు తెలియచేయాలని ఆదేశించారు. దినపత్రికలు, టీవీ ఛానెళ్లలో ప్రకటనలు ఇచ్చేందుకు అభ్యర్థులు ముందుగా ఏ విధంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందో అదే విధంగా ఇంటర్నెట్ ఆధారిత మీడియా/వెబ్‌సైట్లకు కూడా అనుమతి తీసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు మీడియా ప్రకటనలను విడుదల చేసే ముందు ఎన్నికల కమిషన్ నియమించిన కమిటీ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ప్రచారానికి సోషియల్ మీడియాను వాడుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలన్నదే ఎన్నికల కమిషన్ ఉద్దేశమని, ఇందుకు అనుగుణంగా శనివారం పత్రికాప్రకటన జారీ చేశామన్నారు. సోషియల్ మీడియాలో ప్రకటనలను రూపొందించే వారు, షేర్ చేసే వారు, ఫార్వర్డ్ చేసే వారు ఈ విషయాలను గమనించి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.