తెలంగాణ

ఉత్తమ్ వల్లే నాకు టిక్కెట్ రాలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వల్లే తనకు సనత్‌నగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ దివంగత మర్రి చెన్నారెడ్డికి కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం ఉండేది. చెన్నారెడ్డి కుమారుడైన మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మర్రి శశిధర్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చినట్లయితే గెలవలేరని, సర్వే నివేదిక కూడా ఆ విధంగా వచ్చిందని ఉత్తమ్ ఇటీవల పార్టీ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టి తనకు టిక్కెట్ రాకుండా చేశారని శశిధర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అధిష్టానాన్ని తప్పుదారి పట్టించారని ఆయన దుయ్యబట్టారు. సనత్‌నగర్ టిక్కెట్ కావాలని టీడీపీ కోరకపోయినా, పార్టీ రాష్ట్ర నాయకత్వమే బలవంతంగా అంటగట్టిందని ఆయన విమర్శించారు. తనకు వ్యతిరేకంగా కుట్ర, కుతంత్రాలు జరుగుతున్నాయన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు సోమవారం సాయంత్రం ముగిసేలోగా పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సర్వేలో విష్ణువర్దన్ రెడ్డి, కొండా సురేఖల కంటే తనకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు స్పష్టమైందని ఆయన చెప్పారు. టీడీపీ నాయకులు కూడా తనకు టిక్కెట్ ఇస్తేనే విజయం సాధించడం తేలిక అవుతుందని అభిప్రాయపడుతున్నారని తెలిపారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఆయన చెప్పారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని అన్నారు. ప్రజలు తనకు సంపూర్ణ మద్ధతు తెలుపుతున్న సమయంలో ఇలా చేయడం భావ్యం కాదన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆలోచన ప్రకారం తాను నడుచుకుంటానని ఆయన చెప్పారు. ఉత్తమ్ సర్వేలో వాస్తవాలు లేవని శశిధర్ రెడ్డి అన్నారు. విజయం సాధించడం కోసమే పొత్తులు పెట్టుకోవాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని, కట్టుబడి ఉంటానని చెప్పారు. కానీ ఉత్తమ్ తాను గెలవలేనని స్క్రీనింగ్ కమిటీ ముందు గట్టిగా చెప్పడం సరైంది కాదని అన్నారు. ఇలాఉండగా సోమవారం నామినేషన్ దాఖలు చేసేందుకు మర్రి తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు.