తెలంగాణ

ఓకే రోజు 643 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ శాసనసభకు నామినేషన్ల దాఖలు వేగవంతం అవుతోంది. గత ఐదురోజుల్లో 854 నామినేషన్లు దాఖలు కాగా, శనివారం ఒకే రోజు 643 నామినేషన్లు వచ్చాయి. దీంతో ఈ నెల 12 న నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటి నుండి ఇంత వరకు దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 1497 కు చేరింది. ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లను స్వీకరించడం లేదని రాష్టస్థ్రాయి ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. సోమవారం 19 వ తేదీ. నామినేషన్ల స్వీకరణకు చివరిరోజు. అంటే నామినేషన్లను దాఖలు చేసేందుకు ఒకేఒక రోజు మిగిలినట్టయింది. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లను దాఖలు చేశారు. ఒక నామినేషన్ పత్రం చెల్లకపోతే మరొక నామినేషన్ ‘స్టాండ్‌బై’ గా ఉంటూ తమను ఆదుకుందన్నది అభ్యర్థుల అభిప్రాయం. అందుకే చాలా మంది ఒకటికన్నా ఎక్కువ నామినేషన్లు వేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గజ్వేల్ నుండి రెండు నామినేషన్లను వేశారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ తరఫున 165 నామినేషన్లు, బిజేపీ తరఫున 142 నామినేషన్లు, టీఆర్‌ఎస్ తరఫున 156 నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం తరఫున 36, సీపీఐ తరఫున రెండు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున 15, బీఎస్‌పీ తరఫున 70, టీడీపీ తరఫున 32 నామినేషన్లు, ఎంఐఎం తరఫున ఎనిమిది, వైసీపీ తరఫున ఒక నామినేషన్ దాఖలైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించిది. అయినప్పటికీ ఈ పార్టీ తరఫున నామినేషన్ దాఖలైంది.