తెలంగాణ

బీజేపీతో టీఆర్‌ఎస్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీతో టీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని టీటీడీపీ అధినేత ఎల్ రమణ ఆరోపించారు. శనివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యుజెఎఫ్ - హెచ్‌యూజే సంయుక్తంగా నిర్వహించిన మీట్ ద మీడియా కార్యక్రమంలో రమణ మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు ఒకేమారు వస్తాయని తాము అనుకున్నామని, దాని వల్ల ఎన్నికల ఖర్చు తగ్గేదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారని నిందారోపణలు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అన్నారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి కలుపుకున్నారని, ప్రతిపక్షాలు లేవని కేసీఆర్ అంటున్నారని, మరో పక్క మళ్లీ ప్రతిపక్షాలు బలహీనపడ్డాయని చెబుతున్నారని పేర్కొన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, కేసీఆర్ మేనిఫెస్టో భగవద్గీత , ఖురాన్ లా ఆయన ఫీల్ అవుతున్నారని, యువత కోరుకున్న ఉద్యోగాలను ఆయన కల్పించలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ ఇంత వరకూ ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారని, అందుకు 6.50 లక్షల కోట్లకు పైగా నిధులు వెచ్చించారని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రీడిజైనింగ్ పేరుతో లక్షలు వృధా చేశారని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టారని, తన కుటుంబానికి ప్రభుత్వ పాలనలో పెద్ద పీట వేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ , బీసీ మైనార్టీ మహిళలకు పెద్ద పీట వేసిందని అన్నారు. కానీ కేసీఆర్ ఎవర్నీ పట్టించుకోవడం లేదని, ఒక పైరవీ భవన్‌ను ఏర్పాటు చేసుకుని దొరల పాలన సాగిస్తున్నారని అన్నారు. వార్ ఒన్ సైడ్ అంటున్న కేసీఆర్ ఓయూకు వెళ్లి రావాలని సవాలు విసిరినా, దానికి ఇంత వరకూ స్పందించలేదని రమణ పేర్కొన్నారు. ల్యాండ్, శాండ్ మాఫియా, పబ్ కల్చర్ తెలంగాణలో పెరిగిందని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న కేసీఆర్ ధర్నా చౌక్‌ను ఎత్తివేశాడని అన్నారు. కేసీఆర్ ఒక బద్దక సీఎం, ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు అని అన్నారు. కేటీఆర్‌కు సన్యాసం ఇప్పించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేటీఆర్ గెలిస్తే అధికారం చెలాయిస్తూ , ఓడిపోతే పారిపోదాం అని చూస్తున్నారని నేటి తెలంగాణ పరిస్థితిని అర్ధం చేసుకుని తాము ఒక కూటమిగా ఏర్పాడ్డామని చెప్పారు. శాండ్ మాఫియాలో అనేక కుటుంబాలపైన అకృత్యాలు జరిగాయని, మీరా కుమార్ వచ్చి కంటతడిపెట్టినా దానిని పట్టించుకోలేదని అన్నారు. బెంగాల్ మాదిరి కామన్ మినిమం ప్రోగ్రాం ఉండాలని అనుకునే అన్ని పార్టీలతో భేషరతుగా కూటమిని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. దీనికి కోదండరామ్‌ను పెద్దదిక్కుగా పెట్టామని, మహా కూటమి అధికారంలోకి వస్తే తొలి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు, 20వేల డీఎస్సీ నియామకాలు, 3వేలు చొప్పున పెన్షన్లు , నిరుద్యోగులకు భృతి వంటివి కల్పిస్తామని చెప్పారు. మహాకూటమిలో మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. తెలంగాణలోని మీడియాను కేసీఆర్ తన గుప్పిట్లో పెట్టుకున్నారని మహాకూటమి ఏర్పాటుకు కేసీఆర్ నియంతృత్వమే కారణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే ఉందని చెప్పారు.
అమరుల కుటుంభబాలను కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు ఎం సోమయ్య, బి బసవపున్నయ్య, హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఇ చంద్రశేఖర్, పద్మరాజు, విజయానంద్, రాజశఏఖర్, సలీమా, నాగవాణి పాల్గొన్నారు.