తెలంగాణ

లాంచీ ప్రమాదంతో గుండె బరువెక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లాంచీ ప్రమాదంపైనా, చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపైనా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బుధవారం నాడు స్పందించారు. లాంచీ ప్రమాదంతో తన గండె బరువెక్కిందని, గిరిజనులు జలసమాధి కావడం ఆందోళన కలిగించిందని పవన్‌కళ్యాణ్ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. అలాగే ఆడబిడ్డలను కాపాడటంలో పాలనావ్యవస్థలు విఫలమయ్యాయని అన్నారు. వాడపల్లి కొండ్రుకోట సమీపంలో పడవ మునిగిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. రోజువారీ అవసరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జలసమాధి కావడం ఆందోళన కలిగించిందని అన్నారు. 60 అడుగుల లోతున లాంచీ మునిగిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధమైందని అన్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియగానే బాధిత కుటుంబాలకు అండగా నిలిచి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోమని జనసేన కార్యకర్తలకు సూచించినట్టు చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకు శాపం కాకూడదని అన్నారు. ఈ ఘటనలవో అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సక్రమంగా లేవంటే లోపం ఎవరిదని అన్నారు. జవాబుదారీతనం లేని పాలనా విధానాలే అమాయకులను జలసమాధి చేశాయని, దుర్ఘటన జరగ్గానే హడావుడి చేసే పాలకులు, సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపించాలని, ప్రజల వద్దకు పాలన ప్రకటనలకే పరిమితమా అని ప్రశ్నించారు. నిత్యావసరాలకు వైద్యం, విద్య కోసం ఏ చిన్నపని ఉన్నా నదిలోనే ప్రయాణాలు సాగిస్తూ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ శాఖలు గిరిజన గూడెంలపై శ్రద్ధ చూపడం లేదని, పోలవరం నిర్వాసితులు అధికారులు చుట్టూ తిరిగి వెళ్తూ ఈ ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరచి గిరిజనులకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. నదుల్లో అనుమతి లేని బోట్లు తిరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కృష్ణా నదిలో బోటు ప్రమాదం మరువక ముందే ఈ ప్రమాదం జరగడం దారుణమని అన్నారు.ఆడపిల్లల్ని తప్పుగా చూస్తే ఊపేక్షించం అంటూ ప్రభుత్వం చేసే హెచ్చరికలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని పవన్‌కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై వృద్ధుడు చేసిన అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు నగరంలో రెండో తరగతి చదువుతున్న చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. ఈ వార్త మనసును కలచివేస్తోందని చెప్పారు. బాలికలు, యువతులపై ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటుండటం పాలనా వ్యవస్థల వైఫల్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఫోక్సో చట్టాన్ని కఠినంగా అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, చిన్నారులపై మావన మృగాలు బరితెగిస్తున్నాయని ఆ చట్టం సక్రమంగా అమలుకావడం లేదని అర్ధం అవుతోందని పేర్కొన్నారు.