తెలంగాణ

కాంగ్రెస్, జేడీఎస్‌ను చీల్చబోమని భరతమాత మీద ఒట్టు పెట్టగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: కర్నాటకలో అధికారం కోసం కాంగ్రెస్, జెడిఎస్‌లను చీల్చబోమని భరతమాత మీద ఒట్టు పెట్టి చెప్పగలరా? అని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించారు. నీతులు చెప్పే బీజేపీ నాయకులు ఇప్పుడు కర్నాటకలో జెడిఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి ఆ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్-జెడిఎస్‌లకు కలిపి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం లేదని ఆయన విమర్శించారు.
సర్కారియా కమిషన్ నివేదిక ప్రకారం సంపూర్ణమైన మెజారిటీ సాధించిన పార్టీని తొలుత ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని, లేనిపక్షంలో ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేసిన పార్టీలను లేదా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏకమైన (గ్రూపు) పార్టీలను పిలవాల్సి ఉంటుందన్నారు. గతంలో ఇటువంటి సంప్రదాయాలూ ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు కర్నాటక గవర్నర్ సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం పిలవాలని ఆయన కోరారు.
కర్నాటకలో జెడిఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు ముందుకు రావడంతో టెంట్ లేకుండా ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యిందన్నారు. ప్రతి రోజూ సినిమా, వివిధ అంశాలపై ట్విట్ చేసే ట్విట్టర్ పిట్ట ఇప్పుడు ఎందుకు ట్వీట్ చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరా? పిట్ట అని ప్రశ్నించగా, మంత్రి కేటీఆర్ అని ఆయన సమాధానమిచ్చారు.