తెలంగాణ

చేప మందు పంపిణీకి 1.30 లక్షల చేప పిల్లలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జూన్ 8న చేపమందు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి చేప మందుకోసం వస్తున్న ప్రజల సౌకర్యం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, ఆరోగ్యశాఖ, పోలీస్, మత్స్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 173 సంవత్సరాల నుంచి బత్తిన హరినాథ్ కుటుంబ సభ్యులు ఉబ్బస రోగాలను నయం చేయడానికి చేప మందును పంపిణీ చేస్తున్న విషయాలను మంత్రి గుర్తు చేశారు. చేప మందు కోసం ప్రతియేటా వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం వీలైనన్ని ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుందని అందుకు ట్రాఫిక్ సమస్య తలెత్తకండా చూడాలని పొలీసు అధికారులకు మంత్రి సూచించారు. చేప మందుకు వచ్చేవారికి తక్కువ సమయంలో నాంపల్లికి చేరుకోవడానికి హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన కూడళ్లతో పాటు ఆర్టీసి బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి ఆర్‌టిసి బస్సుల సంఖ్య పెంచాలని , అలాగే ప్రతి ఆర్‌టిసి డిపో వద్ద ఇప్పటి నుంచి విస్తత్ర ప్రచారం చేయాలని ఆయన సూచించారు. దాదాపు లక్షా 30 వేల చేప పిల్లల్ని అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. అందరికీ ఆమోదంగా ఎక్కువ బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచాలని, ఆరోగ్య శిబిరాలు, మంచినీటి సౌకర్యాలు, అంబులెన్సులను అక్కడ ఉంచాలన్నారు. మంచినీటి కోసం 3 లక్షల తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేయాలన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రాంతంలో వెలుతురు బాగా ఉండడానికి అవసరమైన లైటింగ్, జనరేటర్లును ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా తమ సేవలను అందించాలన్నారు. సమీక్షా సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, కలెక్టర్ యోగితారాణా, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఆర్టీఓ చంద్రకళ, సెంట్రల్ జోన్ కమిషనర్ రఘుప్రసాద్, వాటర్ వర్క్సు డిపిఒ కృష్ణ, సెంట్రల్ జోన్ డిసిపి విశ్వప్రసాద్, ట్రాఫిక్ డిసిపి బాబురావు, ట్రాన్స్‌కో డిఈ జానేశ్వర్, ఆరోగ్యశాఖ నుంచి సరళ, బత్తిన హరినాథ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.