తెలంగాణ

వృత్తి విద్యాకోర్సులకు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: దేశంలో ప్రతి ఏటా ఇంజనీరింగ్ కాలేజీలు పెరగడం, ఏదో రకంగా ఇంజనీరింగ్‌లో చేరి పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు లేక, వృత్తిపరమైన సామర్ధ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోవడంతో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉభయ రాష్ట్రాల్లో ప్రతి ఏటా లక్షన్నర మంది ఇంజనీరింగ్ యుజి, పిజి విద్యార్ధులు తమ చదువులు పూర్తి చేస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం 10 వేల నుండి 20 వేల వరకూ మాత్రమే లభిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో దొరుకుతున్న ఉద్యోగాలు ప్రతి ఏటా నాలుగైదు వేలు మించడం లేదు. దాంతో వారంతా ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలకోసం వెళ్తున్నారు. మరికొంత మంది ఉన్నత విద్య కొనసాగిస్తుండగా, ఇంకొంత మంది విదేశాలకు వెళ్తున్నారు. దీంతో ఇంజనీరింగ్ వ్యామోహం రోజురోజుకూ తగ్గుతోంది. సాధారణ కాలేజీల్లో ఇంజనీరింగ్‌లో చేరడానికి కూడా విద్యార్థులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. గతంలో సీటు వస్తే చాలు అన్న పరిస్థితి నుండి నేడు మంచి కాలేజీలో మంచి బ్రాంచిలో సీటు వస్తే తప్ప చేరకూడదనే స్థితికి వచ్చారు. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉండటంతో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ కమిటీ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజన్సీలు పలుమార్లు చర్చించి ఈ ఏడాది నుండి ఇంజనీరింగ్ కాలేజీల్లో లాంఛనంగా వొకేషనల్ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఆంధ్రాలో 29 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణలో 41 కాలేజీల్లో ఈ కోర్సులను ప్రారంభిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఆటోమొబైల్ సర్వీసింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ టూల్ మాన్యుఫ్యాక్చరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్స్ మల్టీమీడియా కోర్సు, బిఎఫ్‌ఎస్‌ఐ, ట్రావెల్ అండ్ టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, మెడికల్ ఇమేజ్ టెక్నాలజీ, ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించింది. ఈ కోర్సుల్లో చేరిన వారికి నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ సంస్థ పర్యవేక్షణలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజన్సీ డిగ్రీలను, డిప్లమోలను ఇవ్వనుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు స్కిల్ క్వాలిఫికేషన్ కమిటీతో పాటు వివిధ రంగాలకు వేర్వేరు కమిటీలను నియమించారు. ప్రాధికార కమిటీకి ఎన్‌ఎస్‌డిఎ చైర్మన్ ఎన్‌ఎస్‌డిసికి కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శులు ఇద్దరు, కార్మిక శాఖ కార్యదర్ళి, ఎన్‌ఎస్‌డిఎ డీజీ, మిషన్ డైరెక్టర్లు ఉంటారు. ఈ కోర్సుల్లో 10 స్థాయిల్లో శిక్షణ ఉంటుంది. తొలి దశలో డిప్లమో ఇన్ స్కిల్స్, డిప్లొమో ఇన్ వొకేషనల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ డిగ్రీలను అందజేస్తారు. తెలంగాణలో కొన్ని కాలేజీల్లో డిప్లమో ఇన్ వొకేషన్, మరికొన్నింటిలో బ్యాచిలర్ ఆఫ్ వొకేషన్ కోర్సులను అనుమతించారు. బొమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బిఎఫ్‌ఎస్‌ఐ కోర్సు, డివిఆర్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కేజీరెడ్డిలో ఆటోమొబైల్ సర్వీసింగ్, నర్సింహారెడ్డిలో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, నేతాజీలో మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, స్ఫూర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, తల్లా పద్మావతిలో గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా కోర్సు బ్యాచిలర్ కోర్సులకు అనుమతి ఇచ్చింది. మిగిలిన కాలేజీల్లో డిప్లమో, స్కిల్ డిప్లొమో కోర్సులకు అనుమతి లభించింది. ఆంధ్రాలో ఆదిత్యలో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్, ఆటోమొబైల్ సర్వీసింగ్, గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, వాసిరెడ్డి వెంకటాద్రిలో ప్రొడక్షన్ టెక్నాలజీ బ్యాచిలర్ డిగ్రీలకు అనుమతి ఇవ్వగా, మిగిలిన కాలేజీల్లో డిప్లమో కోర్సులకు అనుమతి లభించింది. ఈ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ప్రైవేటు , ప్రభుత్వ రంగాల్లో విపరీతమైన గిరాకీ ఉంటుందని ఎఐసిటిఇ భావిస్తోంది.