తెలంగాణ

ప్రైవేట్ బస్సుల గాలి తీసేయమనడం పొరపాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ప్రైవేటు పాఠశాలల బస్సులు ఊళ్లోకి వస్తే వాటి గాలి తీసేయాలని తాను పేర్కొనడం తప్పేనని, ఆ ప్రకటనలో ఎలాంటి దురుద్దేశం లేదని, కేవలం ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలన్న ఉద్దేశంతో మాత్రమే తాను అలా చెప్పానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై తనకెలాంటి వ్యతిరేక భావం లేదని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేశానని చెప్పారు. ప్రభుత్వానికి ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలు రెండు కళ్లవంటివని, విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అందరూ సహకరించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఎన్నడూ వ్యవహరించలేదని, 12న రామానుజాపురంలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో తాను చేసిన ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం కడియం అన్నారు.