తెలంగాణ

సింగరేణి కార్మికులకు 72 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: యావత్ సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు ఆధునిక వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ అసుపత్రుల సంఖ్యను 72కు పెంచుతూ సంస్థ సిఎండి శ్రీ్ధర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ సింగరేణి భవనంలో గుర్తింపు పొందిన సింగరేణి కార్మికుల సంఘాల నేతలతో సంస్థ సిఎండి సమావేశం నిర్వహించారు. 35వ సంయుక్తసంప్రదింపుల కమిటీ సమావేశంలో ఉద్యోగుల రక్షణ, సంక్షేమం వంటి అంశాలపై చర్చంచారు. కార్మికులకు ఆధునిక వైద్యం అందివ్వడానికి సంస్థ రూ 10 కోట్లతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నట్టు సిఎండి చెప్పారు. ప్రస్తుతం పని చేస్తున్న అన్ని ఆసుపత్రులను ఆధునీకరిస్తామని చెప్పారు. ప్రతి ఆదివారం నాడు హైదరాబాద్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ బృందాలతో 6 ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నమోదైన 42 ఆసుపత్రులకు అదనంగా మరో 30 ఆసుపత్రులను జాబితాలో చేర్చామన్నారు. కారుణ్య నియామకాల ప్రక్రియ నడుస్తోందని, ఇప్పటికీ 450 మంది వైద్య కారణాలతో అన్‌ఫిట్ కాగా, వీరి స్థానంలో కారుణ్య నియామకాల కోసం కుటుంబ సభ్యులకు అవకాశాలు ఇచ్చామన్నారు. ఇక ప్రతి నెల రెండు లేక మూడు సార్లు మెడికల్ బోర్డు సమావేశం అవుతుందన్నారు. అనారోగ్య కారణాలతోఅన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుల్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా కారుణ్య నియామకాల ప్రక్రియ కొనుగుతుందని చెప్పారు.
సింగరేణిలో అన్ని క్వార్టర్లకు ఏసి కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సత్తుపల్లిలోరూ 100 కోట్లతో కార్మికుల క్వార్టర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. సింగరేణిలో ఎక్కువ లాభాలు వచ్చాయని అందుకు కార్మికుల వాటాపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పనున్నట్టు ఆయన కార్మికులకు వివరించారు. సమావేశంలో సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ పాల్గొన్నారు.