తెలంగాణ

బలమైన అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారు తెలంగాణ దిశగా పయనం
మూడేళ్ల పాలనపై విస్తృత సమీక్ష
రెండేళ్ల భవిష్యత్‌పై కొత్త ఆవిష్కరణ
నేడు తెరాస వార్షికోత్సవ భారీ సభ

హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణకు బొడ్రాయి. ఉద్యమాలకు పురిటిగడ్డ. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర బిందువుగా నిలిచింది చారిత్రక ఓరుగల్లు నగరం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కలను సాకారం చేసి కొత్త రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తన మూడేళ్ల పాలనలో సాధించిన విజయాలు, వచ్చే రెండేళ్లలో వేయబోయే అడుగులను ప్రజల ముందు ఆవిష్కరించేందుకు వరంగల్‌ను వేదిక చేసుకుంది. గురువారం 16వ పుట్టిన రోజు పండుగ వరంగల్‌లో జరుపుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడానికి వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు బాటలు వేసిందన్న సెంటిమెంట్‌తో రెండో దఫా అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి తిరిగి ఇక్కడి నుంచే తెరాస శంఖారావాన్ని పూరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ మూడేళ్లలో బంగారు తెలంగాణ దిశగా తెరాస సర్కార్ వేసిన అడుగులను రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కరించేందుకు ఇదే సభను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వేదికగా ఎంపిక చేసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఏమి చెబుతారోనన్న ఉత్కంఠతో రాష్ట్రం నలుమూల నుంచి వరంగల్‌కు తండోపతండాలుగా పార్టీ శ్రేణులు, ప్రజానీకం తరలివస్తున్నారు. వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు 15 నుంచి 20 లక్షల మంది తరలివస్తారని పార్టీ అంచనా వేస్తుంది. ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు అహోరాత్రులు శమ్రించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో సభ రికార్డు సృష్టించబోతుందని తెరాస అంచనా వేస్తుంది. ఉద్యమ పార్టీగా అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించిన అనుభవానికితోడు ప్రస్తుతం అధికారం కూడా తోడు కావడంతో వరంగల్ సభ భారీగా విజయవంతం అవుతుందన్న దాంట్లో ఎవరికీ అనుమానాలు లేకపోయినా, నాడు ఉద్యమ నాయకుడిగా ప్రజల మెప్పు పొందిన సిఎం కెసిఆర్, నేడు పాలనా సారథిగా ఎంతమేరకు ప్రజల మన్ననలు పొందుతారో తెరాస భవితవ్యానికి వరంగల్ సభనే నాందీ ప్రస్తావన కాబోతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు హైదరాబాద్ నగరం ఒక్కదానిపైనే దృష్టి కేంద్రీకరించి అభివృద్ధికి బాటలు వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌కే పరిమితం కావడంతో రాష్ట్ర జనాభాలో రెండు వంతుల ప్రజానీకం నివసిస్తున్న గ్రామీణ ప్రాంతం నిర్లక్ష్యానికి, వివక్షకు గురైందని టిఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తుంది. సాధించుకున్న కొత్త రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ దిశగా అభివృద్ధిపథం వైపు తీసుకెళ్లడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ లక్ష్యసాధనలో గడిచిన మూడేళ్లలో సాధించిన ప్రగతి, వచ్చే రెండేళ్లలో వేయబోయే మరిన్ని అడుగులు, ఆ తర్వాత ప్రజలు తిరిగి తమకు పాలనా పగ్గాలు అప్పగిస్తే చేయబోయే పనులను ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి ప్రజలకు అవిష్కరించనున్నారు.

చిత్రం... వరంగల్‌లో ముస్తాబైన తెరాస సభా ప్రాంగణం