బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లోబల్ మార్కెట్ల జోరుతో కొనుగోళ్లు
సెన్‌సెక్స్ 217, నిఫ్టీ 72 పాయింట్లు వృద్ధి
ముంబయి, డిసెంబర్ 21: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. గత వారం వరుసగా నాలుగు రోజులపాటు లాభపడిన సూచీలు.. శుక్రవారం నష్టపోయినది తెలిసిందే. ఈ క్రమంలో ఈ వారం తొలిరోజు మళ్లీ లాభాలబాట పట్టాయి. బ్యాంకింగ్, మెటల్, ప్రభుత్వరంగ సంస్థల షేర్లకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల లాభాలతో దేశీయంగా మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగానే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్‌సెక్స్ 216.68 పాయింట్లు పుంజుకుని 25,735.90 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 72.50 పాయింట్లు కోలుకుని 7,834.45 వద్ద నిలిచింది. కాగా, మెరుగైన వ్యాపార నిర్వహణ కోసం సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం దివాలా బిల్లును ప్రవేశపెట్టడంతో ఆ బిల్లు పాసవుతుందన్న ఆశాభావంతోనూ మదుపరులు కొనుగోళ్ల వైపునకు కదిలారు.