జాతీయ వార్తలు

స్టాక్‌మార్కెట్లపై బ్రెగ్జిట్‌ తీవ్ర ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత స్టాక్‌మార్కెట్లపై బ్రెగ్జిట్‌ తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే స్టాక్‌మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ప్రారంభం నుంచే భారీ నష్టాల్లో ట్రేడ్‌ అయిన మార్కెట్లు బ్రెగ్జిట్‌ ప్రభావంతో కుప్పకూలాయి. 1000 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 300 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. బ్రెగ్జిట్‌ ఫలితాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. బంగారం, వెండి ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. శుక్రవారం బులియన్‌ మార్కెట్‌ ప్రారంభమైన తర్వాత బంగారం ధర రూ.1,700 పెరిగిరూ.31,600 వద్ద కొనసాగుతోంది. వెండి ధర రూ.1,300 పెరిగి రూ.42,500 వద్ద కొనసాగుతోంది. బ్రిటన్‌ వాసులు ఎగ్జిట్‌కే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతనమవుతున్నాయి. పౌండ్‌ మారకం విలువ 31 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బ్రెగ్జిట్‌ ప్రభావం జపాన్‌ మార్కెట్లపై కూడా తీవ్రంగా ఉంది. జపాన్‌ మార్కెట్లన్నీ భారీ పతనం దిశగా పయనిస్తున్నాయి.