ఐడియా

కడుపు ఉబ్బరం ఉంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూత్రపిండాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకుంటే వొంట్లో నీరు ఉండిపోయి పొట్ట భాగం ఉబ్బి పోవడం, జ్వరం రావడం, మోకాళ్ల వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.
* నీటిలో జీలకర్ర నానబెట్టి, ఆ రసాన్ని మూడు పూటలా చెంచాడు చొప్పున తీసుకోవాలి.
* మారేడు ఆకుల రసంలో కాస్త మిరియాల పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
* గ్లాసుడు కాచిన పాలలో పసుపుకొమ్ము వేసి మళ్లీ మరగబెట్టి చల్లారాక వడపోసి తాగాలి.
* మరగబెట్టిన పాలలో ఉసిరి ఆకులు వేసి వడగట్టి తాగాలి.
* పచ్చి కాకరకాయల రసాన్ని చెంచాడు చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
* శనగగింజంత ఇంగువ ముద్దను మూడు పూటలా నోట్లో వేసుకుని నమిలినా లేదా వెల్లుల్లి రెబ్బల్ని తరచూ తీసుకున్నా మంచిది.
* మెంతుల్ని మెత్తగా నూరి నీటిలో నానబెట్టి, ఆ రసాన్ని రెండు పూటలా తాగాలి.
* పిప్పళ్ల పొడిలో కాస్త తేనె కలిపి తీసుకున్నా ఉబ్బరం నివారిస్తుంది.
* జాజికాయ, జాపత్రి, మిరియాలు, లవంగాలు, శొంఠి, యాలకులను చూర్ణంలా చేసుకుని నీటిలో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. *