సంజీవని

సకల సమస్యలకు మూలం.. ఒత్తిడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఇప్పుడు పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం. చదువుకి సీటు సంపాదించడంలో పోటీ, పదవుల్లో పోటీ, చదువు పూర్తయినతరువాత ఉద్యోగానికి పోటీ. ఉద్యోగంలో ప్రమోషన్లకి పోటీ.. ఇలా జీవితమంత పోటీలే. ఈ పోటీలతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఇది వేగయుగం కూడా. లేచింది మొదలు పడుకునేవరకూ పరుగులే. పడుకున్నా నిద్రపట్టదు. రేపటి కలలు. మరి ఒత్తిడి పెరగదా?
అలాగే అప్పటి ప్రమాదం చిన్నదైనా గట్టెక్కడానికి తెలీకుండానే ఓ అబద్ధం ఆడతాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం. వీటితోను మనసు అనవసరంగా నలిగిపోతుంటుంది.
పని ఒత్తిడి, ఆఫీసుకు సకాలంలో చేరడానికి ఒత్తిడి... అసలు జీవించడమే ఓ ఒత్తిడి అయిపోయింది.
ఒకప్పుడు ఈ ఒత్తిడి నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితమై వుండేది. ఇప్పుడు పల్లెలకూ వ్యాపించింది.
పెరుగుతున్న ఒత్తిడితోపాటు మానసిక, శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి. ఈ ఒత్తిడి క్రమంగా గుండెమీదా పడుతుంది. దీర్ఘకాలం ఒత్తిడికి గురవ్వడంతో ‘అటోనమిక్ నెర్వెస్ సిస్టమ్’ (అసంకల్పితంగా స్పందించే నరాల వ్యవస్థ) అధికంగా స్పందించి మధుమేహం, జుట్టురాలడం, గుండె జబ్బు, థైరాయిడ్ గ్రంథి అధికంగా స్పందించడం, ఊబకాయం, ఆందోళన, కడుపులో పుండ్లు, సెక్స్ సామర్థ్యం తగ్గడంలాంటి ఇబ్బందులు వస్తాయి.
ఒత్తిడిని తగ్గించే కొన్ని మార్గాలు- ధ్యానం, యోగా, గాలిని గాఢంగా పీల్చి వదలడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వాటిలో కొన్ని. మనసుకి అయిష్టమైన ఏ విషయమైనా ఒత్తిడి కలిగిస్తుంది. అందుకని చేయాల్సిన పనులమీద ఇష్టం పెంచుకోవడం ఎప్పుడూ మంచిదే. ఇష్టంతో కష్టాలను పోగొట్టుకోవచ్చు. పొగ, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా వుండాలి. మితాహారం, సమతులాహారం భోజనానికి భోజనానికి మధ్య దూరం పాటించాలి. నిద్ర చాలినంత పోవాలి. రోజూ మార్నింగ్ వాక్ అవసరం. అన్ని అవయవాలలోకి సున్నితమైనవి నిర్విరామంగా పనిచేసే గుండెమీద ఒత్తిడి పడితే ప్రమాదం. గుండె పనితీరు తగ్గినా చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఈ గుండెమీద ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే జీవన విధానాన్ని సరిచూసుకోవాలి. జీవన విధానంలోకి మన ఆలోచన, ప్రవర్తన, ఆహార విహారాలు, నిద్ర లాంటివన్నీ వస్తాయి. అన్నింటినీ ఒక ప్రణాళికాబద్ధంగా వుండేలా మార్చుకోవాలి.