జాతీయ వార్తలు

స్ట్రెచర్‌పై వచ్చి ఓటుహక్కు వినియోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కాలు కదపలేని పరిస్థితిలో ఉన్నా ఓ యువకుడు తనకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును వినియోగించుకున్నాడు. కుందపుర పోలింగ్ బూత్ వద్దకు గురువారంనాడు ఓ అంబులెన్స్ వచ్చింది. అందులో నుంచి స్ట్రెచర్‌పైకి ఓ కాలుకు కట్టుకట్టిన యువకుడ్ని చేర్చి పోలింగ్ బూత్‌లోకి తీసుకువచ్చారు. ఆ యువకుడు తనకు నచ్చిన నేతకు ఓటు వేసి అదే స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లోకి వెళ్లి సంతృప్తిగా వెళ్లిపోయాడు. ఇంతకు ఆ యువకుడి పేరు జయశీల పూజారి ఉల్తూరు. ఇరవై రోజులు క్రితం ప్రమాదంలో గాయపడ్డాడు. కాలు కదపకూడదు. కాని ఓటు వేయాలనే చైతన్యం అతన్ని పోలింగ్ బూత్‌కు రప్పించింది. ఆ యువకుడ్ని చూసి పోలింగ్ సిబ్బంది సైతం సహకరించారు. అతని ఫొటోను బీజీపీ జాతీయ సంయుక్త కార్యదర్శి జీఎల్ సంతోష్ ట్వీట్ చేశారు.