అంతర్జాతీయం

అమెరికాలో కాల్పులు:విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడోలో ఇద్దరు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. ఎస్టీఈమ్ స్కూలులో చదువుతున్న ఈ ఇద్దరు విద్యార్థులు తుపాకులతో మిగతా విద్యార్థులపై కాల్పులకు పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లో ఒక విద్యార్థి మృతిచెందగా మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 1800 మంది వరకు ఉన్నారు. భద్రతాసిబ్బంది కాల్పులకు పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.