జాతీయ వార్తలు

విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ విద్యార్థి నాయకునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1952 డిసెంబరు 28న మహారాజ్ కిషన్ జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించారు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తగా చేరిన ఆయన 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు నాయకుడిగా గెలుపొందారు. 1982 మే 24న అరుణ్‌జైట్లీకి సంగీతడోగ్రీతో వివాహం జరిగింది. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన తరువాత 1990లో సీనియర్ అడ్వకేట్‌గా హోదా పొందారు. జైప్రకాష్ నారాయణ అడుగుజాడల్లో నడిచే ఆయన 1980లో బీజేపీలోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరం బీజేపీ ఢిల్లీ యూత్ వింగ్‌కు సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1999లో సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. రెండువేల సంవత్సరంలో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం న్యాయశాఖ మంత్రిగా జైట్లీ నియమితులయ్యారు. 2006, 2012లో కూడా ఆయన గుజరాత్‌కు రాజ్యసభ సభ్యునిగా వ్వహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. రక్షణ శాఖ మంత్రిగా ఆయన రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. నాలుగుసార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన జైట్లీ అస్తమయం ఆ పార్టీకి తీరని లోటు. ఎమర్జెన్సీని త్రీవంగా వ్యతిరేకించిన ఆయన 17 నెలల పాటు జైలుశిక్ష సైతం అనుభవించారు.