రాష్ట్రీయం

ఓయూలో బీఫ్ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10న జరిగే ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం: రాజాసింగ్
నిర్వహించితీరుతాం: విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, నవంబర్ 30: ఉస్మానియా వర్సిటీలో ఈనెల 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌కు వామపక్ష, దళిత మైనార్టీ విద్యార్థి సంఘాలు సన్నాహాలు చేస్తుంటే, మరికొన్ని విద్యార్థి సంఘాలు బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఓయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఫ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్న ఎబివిపి విద్యార్థి సంఘానికి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీఫ్ ఫెస్టివల్‌కు అనుమతి ఇవ్వొద్దని, ఫెస్టివల్‌ను జరపొద్దంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజీవ్ రంజన్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువులు గోవులను దేవతగా పూజిస్తారని, అలాంటి గోవులను హతమార్చడం సరైంది కాదన్నారు. ఓయులో డిసెంబర్ 10న జరిగే బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో విద్యార్థి సంఘాల మధ్య పరస్పసర విరుద్ధ అభిప్రాయాలతో ఓయూలో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎబివిపి విద్యార్థి సంఘానికి మద్దతివ్వడాన్ని నిరసిస్తూ వామపక్ష, దళిత, మైనార్టీ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యేపై తార్నాక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆహారాన్ని నియంత్రించడం భావ్యంకాదని, బీఫ్ తక్కువ ధరకు వస్తుందనే తింటున్నారన్నారు. ఏదేమైనా ఈనెల 10న ఉస్మానియా యూనివర్సిటీలో వామపక్ష, దళిత, మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్ జరిగితీరుతుందని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. బీఫ్ ఫెస్టివల్‌పై విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఓయూ పరిసరాల్లో బందోబస్తు చేర్యలు చేపట్టారు.