సబ్ ఫీచర్

త్రిశంకు స్వర్గంలో డీఎస్సీ-98 క్వాలిఫైడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు న్యాయం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిఎస్‌సి-98 క్వాలిఫైడ్ టీచర్లకు గతంలో హామీ ఇచ్చారు. ఈ హామీపై గత ఆరునెలలుగా ఢిఎస్‌సి క్వాలిఫైడ్ టీచర్లు కొండంత ఆశతో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్టల్రోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన సుమా రు వెయ్యిమంది క్వాలిఫైడ్ టీచర్లు తెలంగాణ సచివాలయం, విద్యాశాఖ మంత్రి చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
జూన్ 6న కేసీఆర్ విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ తర్వాత డిఎస్‌సి-98 నుండి డిఎస్‌సి-2012 వరకు జరిగిన ఉపాధ్యాయ ఎంపిక కమిటీలలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు ఇచ్చారు. 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం కోసం డిఎస్‌సి-98 క్వాలిఫైడ్ టీచ ర్లు పోరాటం చేశారు. 2005 కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కేసిఆర్, డిఎస్‌సి-98 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2014, జూన్ 2న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక, న్యాయం చేయడానికి అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. 2014లో డిఎస్‌సి-98 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమనే తమ ఆదేశాలు అమలు చేయనందుకు సుప్రీంకోర్టు ఆగ్రహించడంతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కోర్టుకు హాజరై ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని స్వయంగా విన్నవించారు. తెలంగాణ నాలుగు జిల్లాలో మిగిలిన అభ్యర్థుల గురించి తెలంగాణ సర్కారు క్వాలిఫైడ్ టీచర్చ గురించి విజ్ఞాపనలు పెరగడంతో ముఖ్యమంత్రి, ఉమ్మడి సర్కారు హయాంలో జరిగిన డిఎస్‌సి-98 నుండి డిఎస్‌సి-2012 వరకు ఆరా తీయాలని ఆదేశాలు ఇచ్చారు.
గత జూన్, జులై నెలలో టీచర్ల బదిలీలు, రేషనలైజేషన్ పూర్తి అయింది. ఆగస్టు 15 లోగా పాత డిఎస్‌సి (98 నుండి 2012 వరకు)లలో మిగిలిన వారికి న్యాయం చేశాక, కొత్త డిఎస్‌సి గురించి విధాన ప్రకటన చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించినట్లు సమాచారం. రాష్ట్రంలో 8వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని సెప్టెంబరు నెలాఖరులోగా భర్తీ చేసి వచ్చే జూన్ లోపు డిఎస్‌సి నిర్ణయిస్తామని విద్యామంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వెల్లడించారు. అయితే ఉపాధ్యాయ దినోత్సవం నాడు పాత డిఎస్‌సి అభ్యర్థులకు న్యాయం చేస్తారన్న ప్రకటన వస్తుందని కొండంత ఆశతో ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది.
కరీంనగర్ జిల్లాలో 2,300 పోస్టులకు డిఎస్‌సి-98 టీచర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాత పరీక్షల్లో కటాఫ్ మార్కులు రాక అధిక సంఖ్యలో టీచర్ పోస్టులు మిగిలిపోయాయి. మొదటి జాబితా విడుదల చేసిన సమయంలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎన్నికలు ఉండడం వల్ల రాత పరీక్షలో నెగ్గిన వారి నెంబర్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించలేదు. అధిక సంఖ్యలో టీచర్ పోస్టులు మిగిలిపోవడంతో అప్పటి టిడిపి సర్కారు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదు కటాఫ్ మార్కులు తగ్గించి ఇంటర్వ్యూలకు పిలిచారు. 85 మార్కులు రాత పరీక్షకు, 15 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్ లిస్టు పెట్టి ఉద్యోగానికి ఎంపిక చేయాలి. కాని రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలలో జీరో, ఒకటి మార్కులు వేశారు. అధికార్లు అవినీతికి పాల్పడి లంచాలు ఇచ్చిన వారికి ఇంటర్వ్యూలో 15 మార్కులు వేశార్న ఆరోపణలు వెల్లువెత్తాయ. సమాచార హక్కు చట్టం రావడంతో 2006లో ఇంటర్వ్యూ మార్కుల అవినీతి బయటపడింది. అధికార్ల అవినీతి కారణంగా 50కి పైగా మార్కులు వచ్చిన వారి పేర్లు టీచర్ జాబితాలో లేవు. రాత పరీక్షల్లో 35,30 మార్కులు వచ్చిన వారి పేర్లు తుది జాబితాలో చోటు చేసుకున్నాయి.
డిఎస్‌సి-98 ఇంటర్వ్యూలలో అవినీతి జరిగిందని రాష్టస్థ్రాయిలో ఉద్యమం జరిగింది. దాంతో టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఎట్టకేలకు 2011 నవంబర్ 24న, జస్టిస్ రఘురామ్, జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ డిఎస్‌సి-98 క్వాలిఫైడ్లకు ఉద్యోగాలివ్వాలని తీర్పు చెప్పింది. ఇప్పటికైనా డిఎస్‌సి-98 క్వాలిఫైడ్లకు తెలుగు ప్రభుత్వాలు న్యాయం చేయాలి.
డిఎస్‌సి-98 క్వాలిఫైడ్లది మొదటినుంచి త్రిశంకు స్వర్గంలో మాదిరిగానే కొనసాగు తోంది. తొలినుంచి అవినీతి ఆరోపణలు తర్వాత విచారణ, ఆ తర్వాత రద్దు వంటి విపరిణామాలతో వీరి జీవితాలు ఆగమ య్యాయ. అప్పుడే నియామకాలు జరిగి ఉన్నట్లయతే వీరు ఇప్పటికి 17 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండేవారు. కాని అవినీతి అక్రమా ల పుణ్యమాని నియామకాలు రద్దవడంతో ఇనే్నళ్లుగా వీరు ఏటూ కాకుండా మిగిలిపో యారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుగజేసుకోకపోతే వీరి జీవితాలు మరింత దుర్భరం కాకమానవు.

- రావుల రాజేశం