సబ్ ఫీచర్

ఈ ‘్ధ్వంస రచన’ ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి పుట్టి కోట్ల సంవత్సరాలైంది. భూమిపైనా, నీటిలోనూ జీవరాశులు పుట్టి లక్షల సంవత్సరాలైంది. ఆదిమానవుడు పూర్తి వికాసం చెంది, రాతియుగాలను దాటి మనిషిగా అవతరించి వేల సంవత్సరాలైంది. మనిషికీ ఈ జీవరాశులకీ, జంతువులకీ ఉన్న తేడా- మనిషి ‘మెదడు’ కలిగి ఉండటమే. ఆ మెదడుకు ఆలోచించే శక్తి ఉండటమే. జంతువులకు మెదడున్నా ఆలోచించలేవు. ఈ ఆలోచనాశక్తే మనిషిని జంతుజాలం నుంచి వేరుచేసింది. ఆ ఆలోచనాశక్తేతోనే మనిషి తనకంటె ఎన్నో రెట్లు బలంగా ఉన్న జంతువులను తన అదుపులోకి తెచ్చుకోగలిగాడు.
ఆలోచనాపరుడిగా ఎదిగిన తర్వాత భూమి పుట్టుక గురించి, గ్రహాల గురించి, మానవ క్రమపరిణామం గురించి మనిషి తెలుసుకోగలిగాడు. క్రూర జంతువులను మచ్చిక చేసుకోగలిగాడు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయగలిగాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల జ్ఞాన సంపదను తన బుద్ధిబలంతో సంపాదించగలిగాడు. అందుకే ‘మానవుడే మహనీయుడ’ని అన్నారు. శక్తిపరుడూ యుక్తిపరుడూ మానవుడే. అన్ని జన్మల కంటే ఉత్కృష్టమైన జన్మ మానవ జనే్మ. కానీ, ఆ మనిషే భూమిని, గాలిని, సమస్త ప్రకృతిని కాలుష్య భరితం చేస్తున్నాడు. స్వచ్ఛమైన నీటిని తాగలేని పరిస్థితిని కలిగించాడు. నదులు, బావులు, కాలువలు చివరకు సముద్రాన్ని కూడా కాలుష్యమయం చేశాడు. కల్తీలేని ఆహారాన్ని తినడం కష్టమయ్యే పరిస్థితులను కలిగిస్తున్నాడు. వస్తు వినిమయ సంస్కృతిని పెంచి పోషిస్తూ పరిశ్రమల పేరుమీద భూగర్భ వనరులను, జల వనరులను, భూమిపై వనరులను విచక్షణారహితంగా తోడిపారేస్తున్నాడు. అపరిమిత బొగ్గు, గ్యాస్, పెట్రోలు, ఇంధన వనరులను కాల్చివేస్తూ విష వాయువులను ఆకాశంలోకి పంపుతున్నాడు. ఫలితంగా సూర్యతాపం నుండి భూమిని కాపాడే ఓజోన్ పొరకు చిల్లులుపడే దుస్థితి ఏర్పడింది. భూతాపం పెరుగుతుంది. మరో 2,3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ధృవ ప్రాంతాల్లోని మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి చాలా భూభాగం నీటిపాలయ్యే అవకాశముంది. మనిషి చేస్తున్న ప్రకృతి విరుద్ధ చర్యలతో కొత్తకొత్త భూకంప జోన్‌లు, సునామీలు కలవరపెడుతున్నాయి. మహనీయుడనుకున్న మనిషి మానవత్వం మరచిపోతున్నాడు. ధనదాహం, అధికార దాహం, అంతులేని తృష్ణలతో యుద్ధ పిపాసి అవుతున్నాడు. భూమిని రక్తిసిక్తం చేస్తున్నాడు. రణరంగం కాని చోటు, మనిషి రక్తం చిందని చోటు భూగోళంపై ఎక్కడా దొరకదు.
మనిషి బతుకును సుఖమయం చేసే ఆవిష్కరణలు కొన్నయితే, భూమిపై మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసే ఆవిష్కరణలు ఇంకొన్ని. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు, పేలుడు పదార్థాలు. బక్కచిక్కిన మనిషి కూడా కుర్చీలో కొర్చొని మీట నొక్కితే భూగోళం, మానవ జాతి భస్మీపటలమయ్యేంత శక్తివంతమైన బాంబులు. వందలు, వేల కిలోమీటర్ల దూరంలోఉన్న లక్ష్యాలను ఛేదించి దేశాలకు దేశాలను, ఒకేసారి కోట్ల జనాన్ని బుగ్గిపాలు చేయగల యుద్ధసామగ్రిని తయారు చేస్తున్నాడు. మనిషే తన స్వార్థం కోసం, సౌఖ్యం కోసం, తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాడు. చెట్లు నరికి ఆక్సిజన్ కరువును సృష్టించాడు. అడవులు నరికి భూములు ఆక్రమించుకొని వర్షాభావ పరిస్థితులను కలిగిస్తాడు. నేలను కాంక్రీటు వనాలుగా మార్చి భూగర్భజలాలు లేకుండాచేస్తాడు. గ్రానైట్ రాళ్ళకోసం గుట్టలను ధ్వంసం చేసి ప్రకృతి సమతుల్యతను ధ్వంసం చేస్తాడు. మానవ జాతిని మాత్రమేకాదు, మొత్తం జీవరాశులను ప్రమాదపుటంచుపై నిలబెడ్తున్నవాడూ మనిషే. గ్రహాంతర సీమలకు శాటిలైట్ పంపుతున్నవాడు, కంప్యూటర్, ఇంటర్నెట్, సెల్‌ఫోన్ లాంటి అద్వితీయ ఆవిష్కరణలు చేసిందీ మనిషే. క్షణాల్లో భూగోళాన్ని బుగ్గిచేయగల భయంకరాయుధాలను తయారుచేసిందీ మనిషే.
‘మరి మనిషి మహనీయుడా? విధ్వంసకారుడా?’ ఓ అమెరికన్ భౌతిక శాస్తవ్రేత్త అన్న ఈ మాటలను గమనిస్తే మనిషి విధ్వంసకారుడో, మహనీయుడో అర్థమవుతుంది. మనిషి కొంతకాలంగా చేస్తున్న తప్పిదాల వల్ల భూగోళంపై రాబోయే వెయ్యేళ్ళ లోపలే జీవరాశులు నివసించగలిగే పరిస్థితులు మృగ్యమవుతున్నాయి. మనిషి జీవించడానికి మరోగ్రహం వెతుక్కోవాల్సి ఉంది. అంటే నాగరికుడిగా, విజ్ఞానవంతుడుగా, మహనీయుడిగా చెప్పుకోబడి మనిషి చేసిందేంటి? చేస్తున్నదేంటి? ఈ హక్కును మనిషికెవరిచ్చారు? ఇదెంత విధ్వంసకార చర్య? ఇప్పుడు చెప్పండి.. మనిషి మహనీయుడా? విధ్వంసకారుడా? పంటలు పండించుకొని ఆహారం తయారుచేసుకునే వనరులున్న భూమిని గడ్డిమొలవని స్థితికి చేర్చే అధికారం మనిషికెవరిచ్చారు? కోట్ల సంవత్సరాలకు ఉపయోగపడాల్సిన సహజ సంపదను నిస్సారం చేసే మనిషి విధ్వంసకారుడు కాడా? జీవరాశులు పీల్చుకొనే గాలిని కలుషితం చేయడం విధ్వంసం కాదా? భూమిపై 6,000 కోట్ల మంది హాయిగా నివసించగలిగే అవకాశాలుంటే 730కోట్ల ప్రపంచ జనాభాకు కూడా ఇండ్లు కట్టుకునే అవకాశాలు, స్థలం లేని పరిస్థితులను కల్పించింది మనిషే కదా! మనిషి చేస్తున్న ఈ విధ్వంసం- జీవరాశుల మనుగడను కోట్ల సంవత్సరాల నుండి వందల సంవత్సరాలకు కుదిస్తుంది. అందువల్ల మనిషి లోపలి ఈ విధ్వంస గుణం నశించి మహనీయాంశ, మానవీయాంశ వెల్లువెత్తాలి.
ఈ భూగోళంపై మానవ జాతితోపాటు ఇతర జీవరాశులన్నీ సౌఖ్యంగా బతుకగలిగే పరిస్థితులను కల్పించడమే, అలాంటి ఆవిష్కరణలు చేయడమే మానవీయత. అందుకోసం ‘సైన్స్ విత్ హ్యూమన్ టచ్’ అనేలా అభివృద్ధి మాత్రమే కొనసాగాలి. భూగోళంపై మానవజాతి, జీవరాశుల మనుగడను శాశ్వతం చేసే ఆవిష్కరణలు, పనులు చేసినప్పుడే మనిషి మహనీయుడవుతాడు. తెలిసో తెలియకో ఇంతవరకు చేసిన విధ్వంస చర్యలకు ఇకనైనా స్వస్తిపలికి- ‘మానవుడు విధ్వంసకారుడు కాడు, మహనీయుడు మాత్రమే’అనే దిశలో పయనించాలని, పయనిస్తాడని అందరం ఆశించాలి. తాత్కాలిక సుఖాలను, శాశ్వత దుఃఖాన్ని కాకుండా, శాశ్వత సుఖం కోసం మాత్రమే పాటుపడాలని కోరుకుందాం. అలా జరిగిన నాడు మనిషి తప్పకుండా మహనీయుడే.

- కాలువ మల్లయ్య సెల్ : 98493 77578