సబ్ ఫీచర్

నిరాడంబర రాజనీతిజ్ఞుడు ( నేడు లాల్‌బహదూర్ వర్ధంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో ఉన్నత విలువలు ఉండాలని చెప్పడమే కాదు, తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో అమలు చేసిన ఘనత ఆయనదే.. నిస్వార్థం, నిరాడంబరం అనేవి ఆయనకు సహజ ఆభరణాలు.. మన దేశానికి రెండో ప్రధానిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్ర్తీ ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూ పాలనలో తనదైన ముద్ర వేసుకుని చిరస్థాయి కీర్తి గడించారు. కేంద్రమంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆయన అప్పట్లో పెను సంచలనం సృష్టించారు. వారసత్వ రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్య వ్యవస్థకు వనె్న తెచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన జీవితం ఓ అమూల్య సందేశం, ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం.
1956లో తమిళనాడులో జరిగిన ఓ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆదర్శ నాయకుడు శాస్ర్తిజీ. పొట్టివాడైనా గట్టివాడని నిరూపించుకున్న మహానేత. ప్రధానమంత్రి పదవిలో ఉన్నది కొద్ది కాలమైనప్పటికీ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. పదవుల కోసం, కీర్తిప్రతిష్టల కోసం, ఆస్తిపాస్తుల కోసం ఆయన పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి.
వారణాసి (యుపి) సమీపంలోని మొగల్ సరాయ్‌లో 1904 అక్టోబర్ 2న లాల్‌బహదూర్ జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య గంగానది ఆవలి ఒడ్డున హరిశ్చంద్ర పాఠశాలలో సాగింది. రోజూ పడవలో నదిని దాటి బడికి వెళ్లాల్సి వచ్చేది. ఓరోజున పడవలో వెళ్లేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో పుస్తకాలను, బట్టలను చేతపట్టుకొని కాలువను ఈదుకొని బడికి వెళ్లిన ధైర్యశాలి ఆయన. పేద కుటుంబంలో జన్మించినందున ఎన్ని సమస్యలు వెంటాడినా లాల్ బహదూర్ వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించారు.
విద్యార్థి దశలో భారత సేవాసమితి అనే సంస్థలో పనిచేస్తూ, ‘లోకమాన్య’ బాల గంగాధర తిలక్ ఉపన్యాసాలకు ఎంతగానో ప్రభావితుడయ్యారు. 1921 గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ‘శాస్ర్తీ’ అనే పట్టాను పొందాక ఆయనను లాల్‌బహదూర్ శాస్ర్తీగా అందరూ పిలిచేవారు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలోను, 1921నుంచి 1945వరకు జరిగిన స్వాతంత్య్ర సమరంలోను చురుకైన పాత్రను నిర్వహించారు. సుమారు పదేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 1927లో శాస్ర్తీకి లలితాదేవితో పెళ్ళయింది. మామగారి నుంచి కట్నంగా ‘చరఖా’ను మాత్రమే స్వీకరించిన ఆదర్శవాది ఆయన. ఓసారి అలహాబాద్‌లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు కాంగ్రెస్ నాయకులంతా భయపడగా, మహిళగా దుస్తులు వేసుకుని ఆయన జెండాను ఎగరేశారు. జైలులో ఉన్నపుడు మేడం క్యూరీ జీవితాన్ని హిందీలోకి అనువదించారు. విదేశీ వస్తుబహిష్కరణ ఉద్యమంలో తన భార్య పాల్గొనేలా స్ఫూర్తిని కలిగించారు. శాస్ర్తిజీ 1937లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ శాసనసభకు, 1951లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1952లో రైల్వేమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1956లో జరిగిన రైలుప్రమాదంలో 144 మంది మృతి చెందడంతో మంత్రి పదవిని పరిత్యజించారు. ఈ చర్య భావితరాల వారికి ఆదర్శంగా నిలుస్తుందని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కితాబునిచ్చారు. ఆ తరువాత రవాణామంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారు. కామరాజ్ నాడర్ పథకాన్ని అనుసరించి హోంమంత్రి పదవికి రాజీనామాచేశారు. నెహ్రూ కోరిక మేరకు శాఖ లేని మంత్రిగా కొన్నాళ్లు పనిచేశారు. 1964 మే 27న నెహ్రూ మృతి చెందినపుడు అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా శాస్ర్తిజీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ బాధ్యతలు చేపట్టిన సమయంలో దేశాన్ని అతలాకుతలం చేసిన ఆర్థిక మాంద్యం, ఆహార ధాన్యాల కొరత, నిరుద్యోగం, పేదరికం, ఆకలిచావులు వంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు శాస్ర్తీ నడుం బిగించారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించారు. వివిధ దేశాల్లో పర్యటించి దౌత్య సంబంధాలు మెరుగయ్యేలా కృషిచేశారు. 1965లో జరిగిన భారత్, పాకిస్తాన్ యుద్ధంలో ఆయూబ్‌ఖాన్‌కు తన తడాఖాను చూపించారు. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. అప్పుడే ఆయన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఇచ్చి భారత జాతిని ఉత్తేజపరిచారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఒప్పందం కోసం శాంతిస్థాపనకు రష్యా నాయకుల ఆహ్వానంపై ఆయన తాష్కెంటును సందర్శించారు. ఒప్పందంపై 1966 జనవరి 10న సంతకాలు చేశారు. మర్నాడు జనవరి 11న గుండెపోటుతో తాష్కెంటులోనే అంతిమ శ్వాస విడిచారు. ఆయన మనకిచ్చివెళ్లిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఇప్పటికీ మార్మోగుతునే ఉంది. ఆయనకు మరణానంతరం ‘్భరతరత్న’ బిరుదును ప్రకటించి ప్రభుత్వం గౌరవించింది. ఆయన ఆదర్శాలు ఎప్పటికీ భారతీయులకు మార్గదర్శకం.

- వాండంగ్రి కొండలరావు