సబ్ ఫీచర్

అమ్మవారికి వెన్నపూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా పుణ్యక్షేత్రం. అమ్మవారి పేరు బ్రిజేశ్వరీదేవి. ఈమె పేరు ఎంతోమంది పెట్టుకుంటారు. ఈ కొండమీది అమ్మవారి దేవాలయానికి ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలనుంచేగాక యు.పి నుంచి కూడా మకర సంక్రాంతికి భక్తులు తరలి వస్తారు. సరిగ్గా సంక్రాంతి నాటికి అమ్మవారి విగ్రహానికి నూట ఎనిమిదిసార్లు అభిషేకం చేశాక- తాజా వెన్న తెచ్చి పూత పూస్తారు. ఈ సంప్రదాయం తమిళనాడులో ఆంజనేయస్వామి దేవాలయాల్లో వుందిగానీ- భక్తులు కిలో లేదా రెండు కిలోల వెన్న మ్రొక్కుకుంటారు- పూతగా పూస్తామని. కానీ, కాంగ్రాదేవి విగ్రహానికి ఏకంగా టన్నున్నర మీద, మరో వంద గ్రాముల శుద్ధి చేయబడిన వెన్న తెచ్చి పూతగా మెత్తారు. ఈ చల్లని పూతని జనవరి ఇరవైదాకా వుంచి, ఆనాడు వెన్నని తొలగించడం మొదలుపెడతారు.
ఈ వెన్న పూత ప్రసాదం కోసం భక్తులు ఎగబడి అందుకొంటారు. దీనికి మహిమ వుంటుందిట. చర్మవ్యాధులకి యిది తిరుగులేని మందు. మోకాలి నొప్పులకి రుూ ప్రసాదం విరుగుడు- అని నమ్మే భక్తులు కరడుగట్టిన చలిలో అలా వేచి వుంటారు. ఈ వెన్నపూత పూజకి కారణం- పూర్వం ఒకసారి అమ్మవారు రాక్షసులను ‘దునుమాడు’తున్నప్పుడు వాళ్లూరుకుంటారా? ఎదురుదాడి చేశారుట. దేవికి గాయాలు అయినాయి. అప్పుడు దేవతలంతా బ్రిజేశ్వరీ మాత గాయాలకు వెన్నపూతనే మందుగా వాడారుట. అలా ఆ సంప్రదాయం మకర సంక్రాంతి పండుగలలో వారం రోజులు కొనసాగుతున్నది.
*