Others

ఎగరాలి.. ఎగరాలి.. గణతంత్రపు జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగరాలి.. ఎగరాలి.. గణతంత్రపు జెండా!
ఉల్లాసంగా.. ఉత్తేజంగా.. ఆకాశం నిండా!
భారతమాత భౌతిక చిహ్నమా!
భారతీయుల ఆరాధ్య దైవమా!
సమత.. మమత.. మానవతల ప్రతిరూపమా!
శాంతి సౌహార్ర్ధాల సమాహారమా!
స్వాతంత్య్రవీరుల త్యాగఫలమా!

కులమతాలకు అతీతంగా
పేద, నిమ్నజాతి వర్గాలకు బాసటగా
వినువీధిన రెపరెపలాడుచున్న
ఓ మువ్వనె్నల పతాకమా!
గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా!
అందుకో భావి భారత పౌరులు
ప్రేమతో సగౌరవంగా అందిస్తున్న
శతకోటి ప్రమాణాలు! హార్థిక శుభాకాంక్షలు

ఎందరో మహనీయుల, మహాత్ముల
త్యాగఫలం.. గణతంత్రపు జెండా!
దేశభక్తితో ఉత్సాహంగా ఉరకలేస్తూ
జయహో భారత్ అని నినదిస్తూ
ఎగురుతున్నది భారతీయుల హృది నిండా!

ఆ జెండా నీడన- సర్వజనులు
సుఖసంతోషాలతో- భోగభాగ్యాలతో
వర్థిల్లాలని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో
సర్వ సమానత్వం, సమాన సంస్కృతితో
కలకాలం- ఆదర్శవంతమైన భారతావనిగా
సస్యశ్యామలంగా.. విశ్వానికి శిరోభూషణంగా!
భరతావని వికసించాలని
శోభిల్లాలని మనసా, వాచా
ఆకాంక్షిస్తూ.. జై భారత్... జయ జయ భారత్!

- కొడవలూరు ప్రసాదరావు