సబ్ ఫీచర్

ఫ్రశ్నపత్రం తయారీ ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు ఏదో ఒక పుస్తకంలో నుంచి ఆ ప్రశ్న ను యథాతథంగా ఇచ్చే అలవాటు ఉపాధ్యాయులందరికీ ఉంటుంది. కానీ, ఈనాడు ప్రశ్నపత్రాన్ని ఎంతో జాగ్రత్తగా ఆలోచనతో రూపొందిస్తున్నారు. అంతమాత్రం చేత గతంలో చదువుకున్నటువంటి జ్ఞానం వృథా అని కాదు. దాన్ని నేటి సమాజానికి అనుకూలంగా మార్చవలసి ఉంది. వెనకటి కాలంలో చిన్నపిల్లలకు 4తి3 గుణిస్తే ఏం వస్తుందని ప్రశ్నించేవారు. ఇదే జ్ఞానాన్ని ఇంకొక రకంగా అడుగుతున్నారు. ఉదాహరణకు ‘ఎబి+ఈజ్ ఈక్వల్ టు సిబి’ అని ఇస్తే అంకెలను వీటితో సమన్వయ పరచవచ్చును. ఇది గతంలో నేర్చుకున్న 4వ ఎక్కాన్ని ఉపయోగించి చేయటమే. అనగా గతంలో నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ‘ట్రాన్స్‌ఫర్’ చేయాలి. అంటే పాత జ్ఞానాన్ని కొత్త అవసరాలకు అనుగుణంగా మార్చటం అన్నట్టుగా- ప్రశ్నలను విద్యార్థుల మేధస్సుకు పదునుపెట్టే సమస్యగా మార్చాలి. ఉదాహరణకు ఈ సంవత్సరం మొదటిరోజు బుధవారం నాడు వస్తే 735 రోజుల తర్వాత వచ్చే రోజు ఏమిటి? వెనకట మనం భాగహారం అడిగేది. ఈనాడు ఇచ్చిన సమస్యను విప్పేందుకు ‘్భగహారం’ అనే పరికరం ఉపయోగపడుతుందని పిల్లలు గుర్తించాలి. ఇవాళ బుధవారం కాబట్టి ఏడురోజుల తర్వాత బుధవారమే వస్తుంది. అంటే 7తో భాగహారం చేయాలి.
వెనకటి కాలంలో ఱంపాన్ని ఇచ్చి కట్టెను కోయమని చెప్పేవారు. ఈనాడు కట్టెను ఎట్ల తునకలు చేస్తావు? దీన్ని 3 సమాన భాగాలు ఎట్లా చేస్తావు? అని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు దీనికి ఏ పరికరం కావాలో విద్యార్థి ఆలోచిస్తాడు. అప్పుడు ఆ ఱంపం అనే పరికరం విద్యార్థికి వెంటనే గుర్తుకు రావాలి. సమస్కను పరిష్కరంచటం కోసమై ఏ పరికరం కావాలో విద్యార్థే ఆలోచించాలి. దీనే్న సమస్య పరిష్కారం అంటారు. ఇంకా విద్యార్థిని పై స్థాయికి తీసుకుపోవాలంటే ఒకే సమస్యలో నాలుగైదు ప్రక్రియలుంటాయి. ఆ ప్రక్రియలకు కావల్సిన పరికరాలను ఉపయోగిస్తే సున్నితమైన సమస్య పరిష్కారం అంటారు. దీనే్న ‘క్రిటికల్ ప్రాబ్లమ్ థింకింగ్’ అంటారు.
ఈనాడు ప్రక్రియ కన్నా విద్యార్థి ఆలోచనే ప్రధానం. పరీక్షాపత్రం తయారు చేసేటప్పుడు ఏ నైపుణ్యాన్నైతే పరిష్కరించదలుచుకున్నానో అనే దృష్టి ఉండాలి. కానీ ప్రక్రియలు అడగటం ప్రధానం కాదు. ప్రక్రియలను ఎలా ఉపయోగిస్తారో, ఎప్పుడు ఉపయోగిస్తావోనన్నది ప్రధానం. దానికి కావల్సిన ఎత్తుగడలు ప్రధానం. ఈనాడు విద్యార్థి ఆలోచనా విధానాన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న పద్ధతుల్లో పరీక్షించాలి. ప్రశ్నపత్రం తయారుచేసేటప్పుడు ఉపాధ్యాయుడు బాగా ఆలోచన చేయాలి. అలా ఆలోచించే ఉపాధ్యాయుడే కొత్త ఆలోచనలను పరీక్షించగలుగుతాడు.

- చుక్కా రామయ్య