సబ్ ఫీచర్

పచ్చబొట్ల ప్రియులు ‘గిన్నిస్’కెక్కిన చాఠ్లెట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెర్రి వెయ్యి విధాలు’ అని మన పెద్దలు ఊరకనే అనలేదు. వెర్రితో ఒళ్ళంతా టాటూలు (మనం వాటినే పచ్చబొట్లు అంటాం) వేయించుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించింది ఒక మహిళ. ఆమె పెద్దగా చదువుకోలేదనుకొంటే పొరపాటే అవుతుంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు కావడం విశేషం. ఆమె ఎవరో కాదు అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన చార్లెట్టే గుటెన్‌బర్గ్. ఆమె రచయిత. అంతేకాకుండా పర్సనల్ ట్రైనర్‌గా కూడా పనిచేస్తున్నారు. సరిగ్గా దశాబ్ద కాలం క్రితం అంటే 2006వ సంవత్సరంలో ఆమె మొట్టమొదట తన శరీరంపై టాటూ వేయించుకొన్నారు. అప్పటినుంచి ఆమెకు టాటూల పిచ్చి పట్టుకొంది. గత పది సంవత్సరాల కాలంలో తన శరీరంలో 91.5 శాతం టాటూలతో నింపుకొంది. శరీరంలో ఎక్కువ శాతం టాటూలు వేయించుకొన్న మహిళగా చార్లెట్టేను గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు గుర్తించారు. తన శరీరం కలర్‌ఫుల్‌గా టాటూలవల్లనే మారిందని చార్లెట్టే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన శరీరంలో మిగిలిన 8.5 శాతంలో కూడా అవకాశం ఉన్నంతవరకు టాటూలతో నింపుతానని ఆమె అంటున్నారు. ఇది ఇలా ఉండగా, ఆమె భర్త ఛార్లెస్ హెల్మ్‌కే కూడా టాటూల ప్రియుడే. ప్రపంచంలో అత్యంత ఎక్కువ టాటూలు వేయించుకొన్న సీనియర్ సిటిజెన్‌గా ఆయన ఇప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కడం గమనార్హం. శరీరం మొత్తం పచ్చబొట్లు పొడిపించుకోవడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు ఎక్కిన దంపతులు చార్లెస్ - చార్లేట్టేల రికార్డ్ వెర్రి అనాలో, ఇంకేమైనా అనాలో మీరే ఆలోచించండి.

- పి.హైమావతి