సబ్ ఫీచర్

తరగతి గదిలో జ్ఞాన పిపాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గధి రెండు అసమానతల మధ్య ఉన్న సమ్మేళనం. ఉపాధ్యాయుడు తన అధ్యాపక వృత్తికి ముందు పదేళ్ల క్రితం చదువుకున్నవాడు. తరగతి గదిలో నేటి విద్యార్థి 20 ఏళ్ల తర్వాత రాబోయే సమాజానికి చోదకుడిగా నిలవాల్సిన వ్యక్తి. తరగతి గది రోడ్డురోలర్‌గా పనిచేయాలి. దానికే ప్రభుత్వం ‘పాఠ్యాంశం’ అనే ఒక సాధనాన్ని కనిపెట్టింది. ఇది ఇద్దరినీ కూడా తమ విద్యుక్త్ధర్మాన్ని పూర్తిచేయించే సాధనం. ఆ మధ్య భద్రాచలం వెళ్లిన సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు తమ అనుభవాలను వ్యక్తీకరించారు. 8వ తరగతి జీవశాస్త్రంలో జీవ వైవిధ్య సంరక్షణ (బయోడైవర్సిటీ) అనే పాఠం ఉంది. ఆ పాఠంలోని ఒక ప్రశ్న- చిన్న కీటకాలైన తేనెటీగలు, సీతాకోక చిలుకలను మనం ఎందుకు సంరక్షించాలి? పుష్పాల పుప్పొడితో పరపరాగ సంపర్కానికి సీతాకోక చిలుకలు తోడ్పడతాయి. దీనికి అనుబంధంగా మరో ప్రశ్న ఉంది. ఈ కీటకాలను కాపాడేందుకు మనమేమి చేయవచ్చును? ఈ ప్రశ్నకు సమాధానంగా పిల్లలు ‘మొక్కలను పెంచాల’ని అంటారు. కానీ, కొన్ని రకాల మొక్కల మీదనే సీతాకోక చిలుకలు ఎందుకు వాలుతాయి? దీనికి సమాధానం ఉపాధ్యాయునికి తెలియక పోవటం వలన స్ట్ఫారూమ్‌లో దీన్ని చర్చకుపెట్టారు. వారిలో ఓ ఉపాధ్యాయురాలు- ‘ఒక దినపత్రికలో సీత వచ్చింది మా వనానికి అనే వ్యాసం వచ్చింది. దాన్ని చదవండి’ అని చెప్పారు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా శ్రీరంగపట్న అనే ఊళ్లోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉండే పిల్లలు ఇంటర్న్‌షిప్‌కు వెళ్లారట. అందులో భాగంగా వారు సీతాకోక చిలుకను పరిశీలించారు. సీతాకోక చిలుకలు వాలే చెట్లను గుర్తించి ఆ మొక్కలను వారు నాటారు. ఈ విషయాన్ని కనుగొన్నందుకు ఐక్యరాజ్యసమితి 45వేల రూపాయలు గ్రాంటును 5 ఏళ్ల పాటు మంజూరు చేసింది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్న ఈ చిన్నప్రశ్న ఉపాధ్యాయులను, పిల్లలను ఇద్దరినీ కదిలించింది. సిలబస్‌లో ఉన్న ప్రశ్నల సమాధానానికై ఉపాధ్యాయుడు, విద్యార్థులు కూడా పరిశోధకులుగా మారాల్సి ఉంది. ఆ పరిశోధనతో విద్యార్థులలో ఆసక్తి కలగడం, ఆ ఆసక్తితో ప్రాజెక్టు తయారుకావటం, అది ఉభయుల్లోనూ జ్ఞాన పిపాసను కలిగించగలిగితే ఆ పాఠం లక్ష్యం నెరవేరుతుంది. భద్రాచలంలో జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై రెండేళ్లుగా పరిశోధన చేశారు. దాంతో అక్కడి విద్యార్థుల్లో పెను మార్పు వచ్చింది. తరగతి గది ఈ విధంగా రోడ్ రోలర్‌గా పనిచేస్తూ ఉంటుంది.

- చుక్కా రామయ్య