సబ్ ఫీచర్

స్మోకింగ్.. స్లోపాయిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మో కింగ్ అనేది నేడు ప్రపంచ సమస్యగా మారిపోయింది. సరదాగా చేసుకునే ఈ అలవాటు శరీరంలో స్లోపాయిజన్‌గా పనిచేస్తుందని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జరిపిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. 187 దేశాలలో అంటువ్యాధి వలే ప్రబలిన ఈ ధూమపానంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ పలు విషయాలను వెల్లడించిం ది. గుండెజబ్బు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న స్మోకింగ్ మహిళల్లో క్రమేణ విస్తరిస్తుంది. రోజుకు ఒకటెండ్రు సిగరెట్లే కదా అనుకుంటారు. ఒకటి తాగినా అకాల మరణం ముప్పు 64శాతం సంభవిస్తున్నట్లు ఈ జర్నల్‌లో పేర్కొన్నారు. 1-10 సిగరెట్లు తాగేవారిలో అకాల మరణం 87శాతం సంభవిస్తున్నట్లు తెలిపింది. అభివృద్ధిచెందిన దేశాలలో పొగ బయటకు వదులుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. పురుషులు 30శాతం, మహిళలు 17శాతం, అభివృద్ధిచెందుతున్న దేశాలలో పురుషులలో 32శాతం, మహిళల్లో 3శాతం ఉన్నట్లు వెల్లడైంది. దక్షిణ అమెరికాలో రోజుకు 109 సిగరెట్లు తాగుతున్నట్లు అంచనావేశారు. పది వెయ్యిమందిలో పొగతాగేవారు గ్రీస్‌లో 312, మెకడోనియాలో 307, సెర్బియాలో 298 మంది ఉన్నట్లు వెల్లడైంది.