సబ్ ఫీచర్

సైలెంట్ కిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలి..ఏలా ఉంటుందో తెలియదు. మనిషికి ప్రాణాధారమైంది. కాని అదే నేడు సైలెంట్ కిల్లర్‌గా మారింది. ప్రకృతి ప్రసాదించిన ఆ శక్తిని చేజేతులారా మనమే కలుషితం చేసుకుంటున్నాం. అందువల్లే ప్రాణాధారమైన ఆ గాలే నేడు మన ప్రాణాలను హరించేదిగా మారింది. కలుషిత గాలి సమస్య ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. స్వచ్ఛమైన గాలిగా మార్చుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాల వ్యాధులతో బాధపడాల్సివస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నాం. గ్లోబర్ ఎయిర్ రిపోర్టు ప్రకారం గాలి కాలుష్యం వల్ల మరణాల రేటు పెరుగుదలలో ఐదవ ర్యాంక్‌కు చేరుకున్నాం.
కాలుష్యకారకమైన గాలిని పీల్చటం వల్ల గుండె, ఛాతి సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటిన బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మంది చనిపోతున్నట్లు నివేదికలో వెల్లడైంది. మనదేశంలో 2010 నుంచి గాలి నాణ్యతాప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడైంది. దీనివల్ల మరణాల రేటు కూడ గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. 2000 సంవత్సరంలో ఇండియాలో 155 మంది చనిపోగా, ప్రపంచవ్యాప్తంగా 86మంది చనిపోయారు. అలాగే 2005లో ఇండియాలో 143, ప్రపంచవ్యాప్తంగా 79, 2010లో ఇండియాలో 135, ప్రపంచవ్యాప్తంగా 70, 2015లో 134, 66 మంది చనిపోయినట్లు గణాంక వివరాలు వెల్లడిస్తున్నాయి.
అత్యధిక జనాభా కలిగిన చైనా, ఇండియా వంటి దేశాలలోనే గాలి కాలుష్యం వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో ఈ రెండు దేశాలలోనే 52శాతం ఉన్నట్లు గ్లోబల్ ఎయిర్ రిపోర్టు పేర్కొంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరచి గాలి శుభ్రంచేసే చర్యలకు ఉపక్రమించాలని హెచ్చరిస్తుంది. చెట్లను పెంచుకుంటే మన జీవితాలు పచ్చగా పదికాలాల పాటు మనగలుగుతాయి.

చిన్నారుల్లో విజృంభిస్తున్న ఆస్తమా

గాలి కాలుష్యం వల్ల ప్రధానంగా విజృంభించే వ్యాధులలో ఆస్తమా ఒకటి. మనదేశంలో ఈ వ్యాధి వ్యాపించటం సర్వసాధారణమవ్వటానికి కారణం గాలి కాలుష్యమే. గత దశాబ్దకాలం నుంచి భారతదేశంలో ఆస్తమా విస్తత్రంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించిం ది. గాలి కాలుష్యం వల్ల వివిధ వయసుల వారిని ఆస్తమా ఏ విధంగా కబలిస్తుందోకింది వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.
2000 (పురుషులు)
70 సంవత్సరాలు పైబడినవారు 11073 మంది, 50-69 వయసువారు 7648, 15- 49 మధ్యవారు 3297, ఐదేళ్ల లోపు వారు 2531 మంది ఆస్తమా వ్యాధిబారిన పడ్డారు.
2005: 70సంవత్సరాల పైబడినవారు 9679 మంది, 50-69మధ్యవారు 6451, 15-49 మధ్య వయసువారు 2687, ఐదేళ్లలోపు వారు 2258 మంది గురయ్యారు.
2010: 70 సంవత్సరాల పైబడినవారు 8959, 50-69 మధ్య వయసువారు 5872, 15-49 మధ్య వయసువారు 2358, ఐదేళ్లలోపువారు 2134 మంది గురయ్యారు.
2015: 70 సంవత్సరాల పైబడినవారు 8990, 50-69 మధ్య వయసువారు 5872, 15-49 మధ్య వయసువారు 2358, ఐదేళ్లలోపువారు 2134 మంది పురుషులు ఈ వ్యాధి బారిన పడ్డారు.
2000 (మహిళలు)
70 సంవత్సరాల పైబడినవారు 11, 167 మంది, 50-69 మధ్య వయసువారు 7568, 15-49 మధ్య వయసువారు 3521, 5-14 మధ్యవారు 6307, ఐదేళ్లలోపువారు 2090 మంది ఉన్నారు.
2005: 70 సంవత్సరాల పైబడినవారు 9550, 50-69 మధ్య వయసువారు 6042, 15-49 వయసువారు 2811, 5-14 లోపువారు 5,662, ఐదేళ్లలోపు వారు 1878మంది ఉన్నారు.
2010: 70 సంవత్సరాలు పైబడినవారు 8891, 50-69 వయసువారు 5361, 15-49 వయసువారు 2449, 5-14 వయసువారు 5413, ఐదేళ్లలోపు వారు 1988 మంది ఉన్నారు.
2015: 70 పైబడినవారు 9291, 50- 69 మధ్యవారు 5709, 15-49 మధ్య వయసువారు 2584, 5-14లోపువారు 5494, ఐదేళ్లలోపు 1928 మంది ఆస్తమా వ్యాధిబారిన పడినట్లు గణాంక వివరాలు.